పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-358.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూప మైన ప్రపంచంబు రూఢి నే మ
హాత్మునందుఁ బ్రతీతమై లరు నట్టి
గుణుఁ డద్వితీయుండును క్షరుండు
నైన యీశ్వరుఁ బరమాత్ము నుదినంబు.

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్ముడా; నీవు = నీవు; పంచ = ఐదు (5); అబ్ద = సంవత్సరముల; వయస్కుండవు = వయసుకలవాడవు; ఐ = అయ్యి; పినతల్లి = పినతల్లి; నిన్ను = నిన్ను; ఆడిన = పలికిన; అట్టి = అటువంటి; మాటలన్ = మాటలచే; నిర్భిన్న = బాగుగ చితికిపోయిన; మర్ముండవు = మనసు కలవాడవు; అగుచునున్ = అవుతూ; జనయిత్రి = తల్లిని; దిగనాడి = విడచిపెట్టి; వనమున్ = అడవికి; ఏగి = వెళ్ళి; తపము = తపస్సు; ఆచరించి = చేసి; అచ్చపు = నిజమైన; భక్తిన్ = భక్తితో; ఈశ్వరున్ = నారాయణుని; పూజించి = పూజించి; మహిత = మహా; విభూతిన్ = వైభవముతో; మెఱసి = విరాజిల్లి; రమణన్ = మనోజ్ఞముగ; త్రిలోక = ముల్లోకముల; ఉత్తరంబు = పైది; ఐన = అయిన; పదమునున్ = స్థానమును; పొందితివి = పొందితివి; అదిగాన = అందుచేత; భూరి = అత్యధికమైన; భేద = భేదములు కలిగిన.
రూపము = స్వరూపములుకలది; ఐన = అయిన; ప్రపంచంబున్ = ప్రపంచము; రూఢిన్ = నిశ్చయముగ; ఏ = ఏ; మహాత్మున్ = మహాత్ముని; అందు = అందు; ప్రతీతము = ప్రసిద్ధము; ఐ = అయ్యి; అలరున్ = విలసిల్లు; అట్టి = అటువంటి; అగుణుడు = హరి {అగుణుడు - గుణములు లేనివాడు, త్రిగుణాతీతుడు, విష్ణువు}; అద్వితీయుండు = హరి {అద్వితీయుండు - రెండవవాడులేనివాడు, అంతాతానైనవాడు, విష్ణువు}; అక్షరుండును = హరి {అక్షరుండును - క్షయములేనివాడు, శాశ్వతుడు, విష్ణువు}; ఐన = అయిన; ఈశ్వరున్ = హరి {ఈశ్వరున్ - ఈశత్వము కలవాడు, విష్ణువు}; పరమాత్మున్ = హరి {పరమాత్మున్ - పరమమైన ఆత్మకలవాడు, విష్ణువు, విష్ణుస్హస్రనామాలులో 11వ నామం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు}; అనుదినంబును = ప్రతిదినము.

భావము:

నాయనా! నీవు అయిదేండ్ల వయస్సులో పినతల్లి నిన్నాడిన మర్మాంతకాలైన మాటలచేత లోలోపల ఎంతో నొచ్చుకొని, కన్నతల్లిని విడిచి, అడవికి పోయి తపస్సు చేశావు. అచ్చమైన భక్తితో భగవంతుణ్ణి పూజించి మూడు లోకాలకూ మీదిదైన ధ్రువపదాన్ని పొందావు. భేదరూపమైన ఈ ప్రపంచం ఏ మహాత్మునియందు ప్రతీతమై ఉంటుందో అటువంటి త్రిగుణాతీతుడు, అద్వితీయుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుని కోసం ప్రతిదినం….