పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-356-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొంఱు స్వభావ మందురు,
కొంఱు కర్మం బటండ్రు, కొందఱు కాలం
బందురు, కొందఱు దైవం
బందురు, కొంద ఱొగిఁ గామ మండ్రు మహాత్మా!

టీకా:

కొందఱు = కొంతమంది; స్వభావము = అంతః ప్రకృతి; అందురు = అంటారు; కొందఱున్ = కొందరు; కర్మంబున్ = కర్మము; అట = అట; అండ్రు = అంటారు; కొందఱు = కొంతమంది; కాలంబు = కాలము; అందురు = అంటారు; కొందఱు = కొందరు; దైవంబున్ = దైవము; అందురు = అంటారు; కొందఱు = కొంతమంది; ఒగిన్ = వరుసగా; కామము = కామము; అండ్రు = అంటారు; మహాత్మ = గొప్పవాడ.

భావము:

కొందరు ఆయనను స్వభావం అంటారు. మరికొందరు కర్మం అంటారు. ఇంకా కొందరు కాలం అంటారు. కొందరు దైవం అంటారు. మరికొందరు కామం అనికూడ అంటారు.