పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-351-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిశితప్రదీప్త ఘన కాండపరంపర వృష్టిచేఁ బొరిం
బొరి వికలాంగులై యడరి పుణ్యజనుల్ పృథుహేతిపాణులై
రుడునిఁ జూచి భూరిభుజప్రకరంబు లెదిర్చి పేర్చి చె
చ్చె నడతెంచు చందమునఁ జిత్రరథున్ బలుపూని తాఁకినన్.

టీకా:

ఖర = కఠినమైన, గట్టిదైన; నిశిత = వాడియైన; ప్రదీప్త = ప్రకాశమానమైన; ఘన = పెద్ద; కాండ = బాణముల; పరంపర = వరుసల; వృష్టి = వర్షము; చేన్ = చేత; పొరింబొరి = వరుసవరుసలుగ, కట్టలుకట్టలుగ; వికలాంగులు = అవిటివారు; ఐ = అయ్యి; అడరి = భయపడి; పుణ్యజనుల్ = రాక్షసులు; పృథు = స్థూలములైన; హేతి = ఆయుధములు; పాణులు = ధరించినవారు; ఐ = అయ్యి; గరుడునిన్ = గరత్మతుని; చూచి = చూసి; భూరి = బహు మిక్కిలి; భుజగ = సర్పముల; ప్రకరంబులు = సమూహములు; పేర్చి = విజృంభించి; చెచ్చెరన్ = వేగముగ; అడతెంచు = బయలుదేరు; చందమునన్ = విధముగ; చిత్ర = చిత్రమైన; రథంబులున్ = రథములను; పూని = కట్టుకొని; తాకినన్ = ముట్టడించగా.

భావము:

నారాయణాస్త్రం నుండి ఉద్భవించిన వాడి బాణాలు తళతళ మెరుస్తూ రాక్షసులను వికలాంగులను చేశాయి. వారు రెచ్చిపోయి పెద్ద పెద్ద కత్తులను చేతుల్లో ధరించి గరుత్మంతుణ్ణి సర్ప సమూహాలు ఎదిరించినట్లు ధ్రువుణ్ణి ఎదుర్కొన్నారు.