పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-347.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని కృతాచమనుఁడయి యావిభుని పాద
మలముఁ దలంచి రిపుభయంరమహోగ్ర
లిత నారాయణాస్త్రంబుఁ గార్ముకమునఁ
బూనఁ దడవఁ దదీయ సంధామునను.

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్మ; లోకులు = జనులు; ఎవ్వని = ఎవని; దివ్య = దివ్యమైన; నామంబున్ = పేరును; సమతన్ = చక్కగా; ఆకర్ణించి = విని; సంస్మరించి = చక్కగా; స్మరించి = ధ్యానించి; దుస్తరంబు = దాటరాని; మృత్యువున్ = మృత్యువును; ఐనన్ = అయినప్పటికిని; సుఖ = సుళువైన; వృత్తిన్ = విధముగ; తరియింతురు = దాటెదరు; అట్టి = అటువంటి; ఈశ్వరుడు = విష్ణువు {ఈశ్వరుడు - ప్రభువు, విష్ణువు}; పరుడు = విష్ణువు {పరుడు - అతీతమైనవాడు, విష్ణువు}; భగవంతుడును = విష్ణువు {భగవంతుడు - మహామహిమాన్వితుడు, విష్ణువు}; శార్ఙ్గపాణి = విష్ణువు {శార్ఙ్గపాణి - శార్ఙ్గము అనెడి విల్లు ధరించువాడు, విష్ణువు}; భక్తజనార్తిహరుండునున్ = విష్ణువు {భక్తజనార్తిహరుండు - భక్తులైనవారి ఆర్తి (బాధలను) హరించువాడు, విష్ణువు}; ఐన = అయిన; విభుడు = విష్ణువు; భవదీయ = నీ యొక్క; విమతులన్ = శత్రువులను; పరిమార్చుగాక = సంహరించుగాక; అని = అని; పలికిన = పలికిన; మునుల = మునుల యొక్క; సంభాషణములు = మాటలు.
విని = విని; కృత = చేసిన; ఆచమనుండు = ఆచమనము చేసినవాడు; అయి = అయ్యి; ఆ = ఆ; విభుని = ప్రభువు యొక్క; పాద = పాదములు అనెడి; కమలమున్ = పద్మములను; తలంచి = తలచుకొని; రిపు = శత్రు; భయంకర = భయంకరము; మహా = మిక్కిలి; ఉగ్ర = భీషణములు; కలిత = కలిగిన; నారాయణా = నారాయణము అనెడి; అస్త్రంబున్ = అస్త్రమును; కార్ముకమునన్ = వింటిని; పూనన్ = ఎక్కుపెట్టడము; తడవు = ఆలస్యము; తదీయ = దాని యొక్క; సంధానమునన్ = ఎక్కుపెట్టడమువలన.

భావము:

“ఓ పుణ్యాత్ముడా! లోకులు ఎవ్వని దివ్యనామాన్ని విన్నా, స్మరించినా దాటరాని మృత్యువును కూడా దాటగలరో అటువంటి ఈశ్వరుడు, పరాత్పరుడు, భగవంతుడు, శార్ఙ్గపాణి, భక్తజనుల బాధలను తొలగించేవాడు అయిన ఆ జగన్నాథుడు నీ శత్రువులను సంహరించుగాక!” అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు ఆచమించి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింట సంధించాడు