పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-345-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యంబును నయ్యక్షుల
మాయ నెఱింగి మునినికాయము వరుసన్
నుమనుమని మను మను మని
మునఁ దలఁచుచును దత్సక్షంబునకున్.

టీకా:

అనయంబున్ = అవశ్యము; ఆ = ఆ; యక్షుల = యక్షుల; ఘన = గొప్ప; మాయన్ = మాయలను; ఎఱింగి = తెలిసి; ముని = మునుల; నికాయము = సమూహము; వరుసన్ = వరుసగా; మను = మనువు యొక్క; మనుమని = మనుమడిని; మను = జీవింపుము; మనుము = జీవింపుము; అని = అని; మనమునన్ = మనసులలో; తలచుచున్ = దీవిస్తూ; తత్ = అతని; సమక్షంబున్ = ఎదురన; కున్ = కు.

భావము:

విరామం లేని యక్షుల మాయలను గ్రహించిన మునులందరూ మనువు మనుమడైన ధ్రువుణ్ణి “మనుము!... మనుము!” అని దీవిస్తూ అతని ముందుకు వచ్చి…