పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-343-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యంబున్ ధ్రువుమీఁద దైత్యకృతమాయాజాలమట్లేచి, బో
మస్తిష్కపురీష మూత్ర పల దుర్గంధాస్థి మేదశ్శరా
నిస్త్రింశ శరాసి తోమర గదా క్రత్రిశూలాది సా
భూభృద్భుజగావళిం గురిసె నుద్దండక్రియాలోలతన్.

టీకా:

అనయంబున్ = అధికముగా; ధ్రువు = ధ్రువుని; మీదన్ = పైన; దైత్య = రాక్షసులచే; కృత = ప్రయోగింపబడిన; మాయా = మాయల; జాలమున్ = వల, సమూహము; అట్లు = ఆవిధముగ; ఏచి = చికాకు పరచి; బోరన = ధారాపాతముగ; మస్కిష్క = పుఱ్ఱెలు; పురీష = మలము; మూత్ర = మూత్రము; ఫల = మాంసము; దుర్గంధ = దుర్గంధము కల; అస్థి = ఎముకలు; మేదస్ = మెదళ్ళు; శరాసన = విల్లులు; నిస్తింశ = ఖడ్గములు; శర = బాణములు; అసి = కత్తులు; తోమర = ఈటెలు; గదా = గదలు; చక్ర = చక్రాయుధములు; త్రిశూల = త్రిశూలములు; ఆది = మొదలైన; సాధన = సాధనములు; భూభృత్ = పర్వతములు; భుజగ = సర్పముల; ఆవళిన్ = సమూహములు; కురిసెన్ = కురిపించెను; ఉద్దండ = భయంకరమైన; క్రియాలోలతన్ = విధముగ.

భావము:

రాక్షసులు ఎడతెరపి లేకుండా ప్రయోగించిన మాయాజాలాలు ధ్రువుని మీద మెదడు, మలము, మూత్రము, మాంసము, క్రుళ్ళిన ఎముకలు, క్రొవ్వు కురిపించాయి; విండ్లు, కత్తులు, బాణాలు, కటారులు, చిల్లకోలలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలైన ఆయుధాలు, కొండలు, సర్పాలు వర్షింపించాయి.