పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-340-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పుడు రాక్షసమాయలు
ప్పిన ధ్రువుఁ డసురవరుల కార్యం బెఱుఁగం
జొప్పడక, వారిఁ బొడగన
దెప్పర మగుటయును సారథిం గని, యంతన్.

టీకా:

అప్పుడు = అప్పుడు; రాక్షస = రాక్షసుల యొక్క; మాయలు = మాయలు; కప్పిన = ముసురుకొనగ; ధ్రువుడు = ధ్రువుడు; అసుర = రాక్షసులలో {అసుర – సురలు కానివారు, రాక్షసులు}; వరుల = శ్రేష్ఠుల; కార్యంబున్ = పనులను; ఎఱుగన్ = తెలియు; చొప్పడక = దారి తెలియక; వారిన్ = వారిని; పొడగనన్ = కనగొన; దెప్పరము = దుస్సహము; అగుటయును = అవుటచేత; సారథిన్ = రథసారథిని; కని = చూసి; అంతన్ = అంతట.

భావము:

అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. రాక్షసుల మాయాకృత్యాలను అతడు తెలిసికొనలేకపోయాడు. వాళ్ళు అతని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు తన సారథిని చూచి …