పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-337-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘు చరిత్రుఁ డమ్మనుకులాగ్రణిచే వికలాంగు లైనవా
సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సము
జ్జ్వ మణికంకణాంగద లద్భుజవర్గముచేత సంగర
స్థ మతిరమ్యమై తనరె సంచిత వీరమనోహరాకృతిన్.

టీకా:

అలఘు = గొప్ప; చరిత్రుడు = వర్తనము కలవాడు; ఆ = ఆ; మను = మనువు యొక్క; కుల = వంశమునందు; అగ్రణి = గొప్పవాని; చేన్ = చేత; వికలాంగులు = అవయవములు విరిగినవారు; ఐన = అయిన; వారల = వారి; స = కలిగిన; కిరీట = కిరీటములు; కుండల = చెవికుండలముల; విరాజిత = విలసిల్లుతున్న; మస్తక = తలలు; కోటిన్ = అనేకము; చేన్ = తో; సముజ్జ్వల = మిక్కిలి ప్రకాశిస్తున్న; మణి = మణులు పొదిగిన; కంకణ = మురుగులు; అంగద = బాహుపురులు కలిగిన; సత్ = మంచి; భుజ = బాహువుల; వర్గమున్ = సమూహము; చేతన్ = తో; సంగర = యుద్ధ; స్థలము = భూమి; అతి = మిక్కిలి; రమ్యము = అందమైనది; ఐ = అయ్యి; తనరెన్ = అతిశయించెను; సంచిత = కలగలిసిన; వీర = వీరత్వము; మనోహర = మనోజ్ఞత్వముల; ఆకృతిన్ = రూపముతో.

భావము:

మహనీయుడు మనువంశంలో శ్రేష్ఠుడు అయిన ధ్రువునిచేత వికలాంగులైనవారి కిరీటాలతో కుండలాలతో ప్రకాశించే శిరస్సులు, మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశించే బాహువులు నిండి ఉన్న ఆ యుద్ధభూమి వీర మనోహరంగా విరాజిల్లింది.