పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-330-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హాహాకారము లెసఁగఁగ
"నోహో యీ రీతి ధ్రువపయోరుహహితుఁడు
త్సాము చెడి యిటు దైత్య స
మూహార్ణవమందు నేఁడు మునిఁగెనె యకటా!"

టీకా:

హాహాకారములు = హాహా యనెడి రవములు; ఎసగగన్ = అతిశయించగ; ఓహో = ఓహో; ఈ = ఈ; రీతిన్ = విధముగ; ధ్రువ = ధ్రువుడు అనెడి; పయోరుహహితుడు = సూర్యుడు {పయోరుహహితుడు - పయస్ (నీటి) యందు ఈరుహ (పుట్టినవి) పద్మములకు హితుడు (ఇష్టుడు), సూర్యుడు}; ఉత్సాహము = విజృంభణము; చెడి = నశించి; ఇటు = ఇలా; దైత్య = రాక్షసుల {దైత్యులు - దితిసంతానము, రాక్షసులు}; సమూహ = సమూహము అనెడి; ఆర్ణవము = సముద్రము; అందున్ = లో; నేడు = ఈనాడు; మునిగెనె = మునిగిపోయెనే; అక్కటా = అయ్యె.

భావము:

హాహాకారాలు చేస్తూ “అయ్యో! ధ్రువుడు అనే సూర్యుడు రాక్షస సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడు కదా!”