పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-329-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెంఱి యుండెను ధారా
సంపాతచ్ఛన్నమైన శైలము భంగిన్
గుంపులు కొని యాకసమునఁ
గంపించుచు నపుడు సిద్ధణములు వరుసన్.

టీకా:

పెంపు = విజృంభణము; అఱి = తగ్గిపోయి; ఉండెను = ఉండెను; ధారా = వర్షపు ధారలు; సంపాత = అధికముగ పడుటచే; ఛన్నము = కప్పబడినది; ఐన = అయిన; శైలమున్ = కొండ; భంగిన్ = వలె; గుంపులు = గుంపులు; కొని = కూడి; ఆకసమునన్ = ఆకాశమునందు; కంపించుచున్ = వణికిపోతూ; అపుడున్ = అప్పుడు; సిద్ద = సిద్ధుల; గణములు = సమూహములు; వరుసన్ = వరుసగా.

భావము:

(ధ్రువుడు) ఎడతెగని వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షుల ఆయుధ వర్షంలో మునిగిపోయాడు. అది చూచి ఆకాశంలోని సిద్ధులు వణికిపోతూ…