పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-327-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

థికోత్తముం దొడరి యందఱు నొక్కటఁ జుట్టుముట్టి పెం
పారఁగ బాణషట్కముల నంగములం బగులంగనేసి వి
స్ఫా గదా శరక్షురిక ట్టిసతోమర శూలఖడ్గముల్
సాథియుక్తుడైన రథిత్తముపైఁ గురిపించి రేపునన్.

టీకా:

ఆ = ఆ; రథిక = రథముపైన యుద్ధము చేయువారిలో; ఉత్తమున్ = ఉత్తముని; తొడరి = సమీపించి; అందఱున్ = అందరును; ఒక్కటన్ = ఒకేమారు; చుట్టుముట్టి = చుట్టుముట్టి; పెంపారగ = అతిశయించగ; బాణ = బాణముల; షట్కములన్ = ఆరేసింటితో; అంగములన్ = అవయవములను; పగులంగన్ = పగలిపోయేలా; ఏసి = కొట్టి; విస్ఫార = బాగా పెద్ద; గదా = గదలు; శర = బాణములు; క్షురిక = చురకత్తులు, ఛురిక; పట్టిస = ఆయుధ విశేషము, అడ్డకత్తి; తోమర = ఆయుధ విశేషము, చిల్లకోల; శూల = శూలములు; ఖడ్గముల్ = కత్తులు; సారథి = సారథి {సారథి – రథము తోలువాడు}; యుక్తుడు = కూడినవాడు; ఐన = అయిన; రథసత్తము = రథయుద్ధము చేయుటలో బహునేర్పరి; పై = పైన; కురిపించిరి = వర్షము వలె కురిపించిరి; ఏపునన్ = చెలరేగి.

భావము:

ఆ మహాయోధుడైన ధ్రువుణ్ణి యక్షులందరు ఒక్కసారిగా చుట్టుముట్టి ఆరేసి బాణాలతో అతని అవయవాలను భేదించారు. పెద్ద పద్ద గదలను, బాణాలను, చురకత్తులను, పట్టిసాలను, చిల్లకోలలను, శూలాలను, ఖడ్గాలను ధ్రువునిపైన, అతని సారథిపైన ఎడతెగకుండా కురిపించారు.