పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-325-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ము మహారథుండు భుజర్వ పరాక్రమశాలియున్ ధను
ర్ధరుఁడును శూరుఁడౌ ధ్రువుఁడు న్ను నెదిర్చిన యక్షకోటిఁ జె
చ్చరఁ బదుమూఁడువేల నొకచీరికిఁ గైకొన కొక్కపెట్ట భీ
ముగ మూఁడు మూఁడు శితకాండములం దగ గ్రువ్వనేసినన్

టీకా:

కరము = మిక్కిలి; మహారథుండు = గొప్పశూరుడు {మహారథుడు - పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథుడు - పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యొధుడు 3)సమరథుడు - ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్థరథుడు - ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు}; భుజ = బాహు; గర్వ = బలము; పరాక్రమ = శౌర్యము; శాలియున్ = స్వాభావికముగ కలవాడు; ధనుర్ధరుడును = విలుకాడు {ధనుర్ధరుడు - ధనుస్సును ధరించినవాడు, విలుకాడు}; శూరుడు = రణసాహసము కలవాడు; ఔ = అగు; ధ్రువుడు = ధ్రువుడు; తన్నున్ = తనను; ఎదిర్చిన = ఎదిరించిన; యక్ష = యక్షుల; కోటిన్ = సమూహమును; చెచ్చెరన్ = వెంటవెంటనే; పదుమూడువేలన్ = పదమూడువేలమందిని (13000); ఒకచీరికిన్ = ఇంచుకేని; కైకొనక = లక్ష్యపెట్టక; ఒక్క = ఒకే; పెట్టన్ = మారుగ; భీకరముగ = భయంకరముగ; మూఁడుమూఁడు = మూడేసి (3); శితకాండములన్ = వాడియైన బాణములతో; తగ = తెగ, మిక్కిలి; క్రువ్వన్ = గ్రుచ్చియెత్తి, గుత్తంగా; ఏసినన్ = కొట్టగా.

భావము:

మహారథుడు, వీరాధివీరుడు, ధనుర్ధారి, శూరుడు అయిన ధ్రువుడు తనను ఎదిరించిన పదమూడు వేల యక్షవీరులనూ లెక్కచేయకుండా భయకరంగా మూడు వాడి బాణాలతో గాయపరిచాడు.