పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-318-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణి దీప నీరాజనంబుల నివాళింపం బౌర జానపద మిత్రామాత్య బంధుజన పరివృతుండై చనుదెంచి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వాత్సల్యంబునన్ = అభిమానముతో; జల్లుచున్ = జల్లతూ; సత్యవాక్యంబులన్ = సత్యవాక్యములతో; దీవించుచున్ = దీవిస్తూ; సువర్ణ = బంగారు; పాత్ర = పాత్రలుచే; రచిత = చేసిన; మణిదీప = మణిదీపముల; నీరాజనంబులన్ = మంగళహారతులను; నివాళింపన్ = హారతు లివ్వగా; పొర = పౌరులు; జానపద = జానపదులు; మిత్ర = మిత్రులు; అమాత్య = మంత్రులు; బంధు = బంధువులు; జన = ప్రజలుచే; పరివృతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; చనుదెంచి = వచ్చి.

భావము:

ఈ విధంగా ప్రేమతో చల్లుతూ యథార్థవాక్కులతో దీవిస్తూ, బంగారు పాత్రలలో మణిదీపాలుంచి హారతు లివ్వగా ధ్రువుడు పౌరులతో, జానపదులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ముందుకు సాగి…