పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-314-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని ప్రశంసించి; రట్లు పౌరజనంబులచేత నుపలాల్య మానుండగు ధ్రువుని నుత్తానపాదుం డుత్తమ సమేతంబుగా గజారూఢునిం జేసి సంస్తూయమానుండును, ప్రహృష్టాంతరంగుండును నగుచుఁ బురాభిముఖుండై చనుదెంచి.

టీకా:

అని = అని; ప్రశంసించిరి = పొగిడిరి; అట్లు = అలా; పౌరజనంబుల = పౌరుల; చేతన్ = చేత; ఉపలాల్యమానుండు = బుజ్జగింపబడుతున్నవాడు; అగు = అయిన; ధ్రువుని = ధ్రువుని; ఉత్తానపాదుడు = ఉత్తానపాదుడు; ఉత్తమ = ఉత్తముని; సమేతంబుగా = తో కూడ; గజా = ఏనుగును; ఆరూఢునిన్ = ఎక్కినవానిగా; చేసి = చేసి; సంస్తూయమానుండునున్ = స్తుతింపబడుతున్నవాడును; ప్రహృష్ట = సంతోషముతో కూడిన; అంతరంగుండు = అంతరంగము కలవాడు; అగుచున్ = అవుతూ; పుర = నగరము; అభిముఖుండు = వైపునకు పోవువాడు; ఐ = అయ్యి; చనుదెంచి = వచ్చి.

భావము:

అని పౌరజనులు ప్రశంసించారు. ఆ విధంగా పౌరులచేత ఉపలాలింప బడుతున్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా ఏనుగుపైన కూర్చుండ బెట్టి, ప్రజల ప్రస్తుతులను అందుకుంటూ మనస్సులో పొంగిపొరలే సంతోషంతో పురం వైపు బయలుదేరి వచ్చి…