పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-313-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నత సంతోష ముప్పతిల్లఁగఁ బౌర-
ము లా ధ్రువుతల్లి నెయఁ జూచి
"తొడరిన భవదీయ దుఃఖనాశకుఁ డైన-
యిట్టి తనూజుఁ డెందేని పెద్ద
కాలంబు క్రిందటఁ డఁగి నష్టుం డైన-
వాఁడిప్డు నీ భాగ్యశము చేతఁ
బ్రతిలబ్ధుఁ డయ్యెను; నితఁడు భూమండల-
మెల్లను రక్షించు నిద్ధమహిమ;

4-313.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మల లోచనుఁ జింతించు నులు లోక
దుర్జయం బైన యట్టి మృత్యువును గెల్తు;
ట్టి ప్రణతార్తి హరుఁడైన బ్జనాభుఁ
ర్థి నీచేతఁ బూజితుం గుట నిజము."

టీకా:

ఉన్నత = అదికమైన; సంతోషమున్ = ఆనందము; ఉప్పతిల్లగన్ = పొంగిపొర్లిపోగా; పౌరజనములు = పౌరులు; ఆ = ఆ; ధ్రువు = ధ్రువుని; తల్లిన్ = తల్లిని; ఎనయన్ = పొందికగ; చూచి = చూసి; తొడరిన = కలిగిన; భవదీయ = నీ యొక్క; దుఃఖ = దుఃఖమును; నాశకుడు = నాశనముచేసిన వాడు; ఐన = అయిన; ఇట్టి = ఇటువంటి; తనూజుడు = పుత్రుడు {తనూజుడు - తనువున పుట్టినవాడు, పుత్రుడు}; ఎందేని = ఎక్కడైన; పెద్ద = చాలా; కాలంబు = కాలము; క్రిందటన్ = కిందట; కడగి = పూని; నష్టుండు = పోయినవాడు; ఐన = అయిన; వాడు = వాడు; ఇప్డు = ఇప్పుడు; నీ = నీ యొక్క; భాగ్యవశము = అదృష్టము; చేతన్ = కొలది; ప్రతిలబ్దుడు = తిరిగిదొరకినవాడు; అయ్యెను = ఆయెను; ఇతడున్ = ఇతడు; భూమండలము = మొత్తము భూలోకము; ఎల్లను = సమస్తమును; రక్షించు = కాపాడు; ఇద్ధ = ప్రసిద్ధ; మహిమన్ = మహిమతో.
కమలలోచను = విష్ణుని; చింతించు = ధ్యానించు; ఘనులు = గొప్పవారు; లోక = లోకమంతటను; దుర్జయంబు = జయింపరానిది; ఐన = అయిన; అట్టి = అటువంటి; మృత్యువునున్ = మృత్యువును కూడ; గెల్తురు = గెలుస్తారు; అట్టి = అటువంటి; ప్రణత = ప్రపన్నులైన భక్తుల; ఆర్తి = బాధను; హరుడు = హరించువాడు; ఐన = అయిన; అబ్జనాభుడు = విష్ణువు {అబ్జనాభుడు - అబ్జము (పద్మము) నాభిన కలవాడు, విష్ణువు}; అర్థిన్ = కోరి; నీ = నీ; చేతన్ = చేత; పూజితుడు = పూజింపబడినవాడు; అగుటన్ = అయియుండుట; నిజము = నిజము.

భావము:

పురజనులు ధ్రువుని తల్లియైన సునీతిని చూచి అంతులేని సంతోషంతో “చాలాకాలం క్రిందట కనిపించకుండా పోయిన నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్ళీ తిరిగి వచ్చాడు. నీ దుఃఖాన్ని తొలగించాడు. ఇతడు సాటిలేని పరాక్రమంతో భూమండలాన్ని పరిపాలిస్తాడు. విష్ణువును సేవించే మహాత్ములు అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ప్రపన్నులైన భక్తుల దుఃఖాన్ని తొలగించే నారాయణుని నీవు నిజంగా ఆరాధించావు.”