పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-310-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నా సజ్జనాగ్రణి యైన ధ్రువుఁడు
ల్లులకు భక్తి వినతులు గ నొనర్చి
సురుచికిని మ్రొక్క నర్భకుఁ జూచి యెత్తి
గు మొగంబున నాలింగనంబు చేసి.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; సత్ = మంచి; జన = వారిలో; అగ్రణి = గొప్పవాడు; ఐన = అయిన; ధ్రువుడు = ధ్రువుడు; తల్లులకు = తల్లులకు; భక్తిన్ = భక్తితో; వినతులు = నమస్కారములు; తగన్ = తగ; ఒనర్చి = చేసి; సురుచి = సురుచి; కిని = కి; మ్రొక్క = నమస్కరించగ; అర్భకుని = పిల్లవానిని; చూచి = చూసి; యెత్తి = లేవనెత్తి; నగు = నవ్వు; మొగంబునన్ = ముఖముతో; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసి = చేసి.

భావము:

సజ్జనులలో గొప్పవాడైన ఆ ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు. సురుచి తనకు మ్రొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ అక్కున జేర్చుకొని...