పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-308-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బిగియఁ గౌఁగిటఁ జేర్చి నెమ్మొము నివిరి
శిరము మూర్కొని చుబుకంబు చేతఁ బుణికి
వ్యయానంద బాష్ప ధారాభిషిక్తుఁ
జేసి యాశీర్వదింప నా చిరయశుండు.

టీకా:

బిగియన్ = గట్టిగ; కౌగిటజేర్చి = కౌగిలించుకొని; నెఱి = నిండు; మొగమున్ = ముఖమును; నివిరి = నివిరి; శిరమున్ = తలను; మూర్కొని = వాసనచూసి; చుబుకంబున్ = గడ్డము; చేతన్ = చేతితో; పుణికి = పుణికి; అవ్యయ = అంతులేని; ఆనంద = ఆనందపు; బాష్ప = కన్నీటి; ధార = ధారలతో; అభిషిక్తున్ = తడసినవానిని; చేసి = చేసి; ఆశీర్వాదింపన్ = ఆశీర్వదించగ; ఆ = ఆ; చిర = మిక్కిలి; యశుండు = యశస్సు కలవాడు.

భావము:

గట్టిగా కౌగిలించుకొని, ముఖం నిమిరి, శిరస్సు మూర్కొని, గడ్డం పుణికి, జలజల ప్రవహించే ఆనందబాష్పాలతో పుత్రుని శిరస్సును అభిషేకించి ఉత్తానపాదుడు ఆశీర్వదించగా, చిరకీర్తివంతుడైన పుత్రుడు ఆ ధ్రువుడు...