పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-307-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దము డిగ్గి ప్రేమ దొలఁకాడ ససంభ్రముఁడై రమామనో
రు చరణారవింద యుగళార్చన నిర్దళితాఖి లాఘు నీ
శ్వ కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతుం
మనురక్తి డాసి పులకల్ ననలొత్తఁ బ్రమోదితాత్ముఁడై.

టీకా:

అరదము = రథము; డిగ్గి = దిగి; ప్రేమ = ప్రేమ; తొలకాడ = తొణికిసలాడ; ససంభ్రముడు = మిక్కిలి కుతూహలము కలవాడు; ఐ = అయ్యి; రమామనోహరు = హరి {రమా మనోహరుడు - రమ (లక్ష్మీదేవి) మనోహరుడు (భర్త), విష్ణువు}; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; యుగళ = జంటను; అర్చన = పూజించుటచే; నిర్దళిత = చక్కగ భేదించబడిన; అఖిల = సమస్తమైన; అఘున్ = పాపములు కలవానిని; ఈశ్వర = హరి; కరుణ = దయతో; ఆలోకన = చూచుటచేత; సు = చక్కగ; జాత = కలిగిన; సమగ్ర = పరిపూర్తి చెందిన; మనోరథున్ = కోరికలు గలవానిని; సుతున్ = పుత్రుని; కరము = మిక్కిలి; అనురక్తిన్ = ప్రీతితో; డాసి = దగ్గరకు వెళ్ళి; పులకల్ = పులకరింతలు; ననలొత్త = చిగురించగ; ప్రమోదితాత్ముడు = సంతోషించిన మనసు కలవాడు; ఐ = అయ్యి.

భావము:

రథం దిగి, అనురాగం పొంగిపొరలగా సంభ్రమంతో ధ్రువునికి ఎదురువెళ్ళాడు. శ్రీపతి పాదపద్మాలను సేవించి పాపాలను పోగొట్టుకొని, ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల కోరికలు తీర్చుకున్న తన కుమారుని సమీపించి ప్రేమతో పులకించిపోతూ సంతోషంగా...