పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-304-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని విశ్వసింపకుండియు
మున నా నారదుఁడు గుమారుఁడు వేగం
బునఁ రాఁగలఁ డనుచును బలి
కి పలుకులు దలఁచి నమ్మి కృతకృత్యుండై.

టీకా:

అని = అని; విశ్వసింపకుండియు = నమ్మకపోయినప్పటికిని; మనమునన్ = మనస్సులో; ఆ = ఆ; నారదుడు = నారదుడు; కుమారుడు = సుతుడు; వేగంబునన్ = తొందరలోనే; రాగలడు = వచ్చును; అనుచున్ = అంటూ; పలికిన = చెప్పిన; పలుకులున్ = మాటలను; తలచి = తలచికొని; నమ్మి = నమ్మి; కృతకృత్యుండు = సఫలీకృతుడు {కృతకృత్యుండు - చేయవలసినది నెరవేర్చినవాడు, ధన్యుడు}; ఐ = అయ్యి.

భావము:

(ధ్రువుడు మరలి వస్తున్నాడు) అని ముందు నమ్మనివాడై “నీ కొడుకు తొందరలోనే తిరిగివస్తాడు” అని పూర్వం నారదుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని అటువంటి అదృష్టం లభిస్తుందేమో అని కొంత విశ్వసించి...