పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-301-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిట్లు చింతించె"నుచు నమ్మైత్రేయ-
ముని విదురునకు నిట్లనియెఁ "దండ్రి!
మనీయ హరిపాద మల రజోభి సం-
స్కృత శరీరులును యాదృచ్ఛికముగ
సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై-
ఱలుచు నుండు మీవంటి వారు
గ భగవత్పాద దాస్యంబు దక్కంగ-
నితర పదార్థంబు లెడఁద లందు"

4-301.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱచియును గోర నొల్లరు నుచరిత్ర!
విలి యిట్లు హరిప్రసాదంబు నొంది
రలి వచ్చుచునున్న కుమారు వార్తఁ
జారుచే విని యుత్తానరణుఁ డపుడు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; చింతించెన్ = విచారించెను; అనుచున్ = అంటూ; మైత్రేయ = మైత్రేయుడు అనెడి; ముని = ముని; విదురున్ = విదురుని; కున్ = కి; ఇట్లు = ఈవిథముగ; అనియె = పలికెను; తండ్రీ = అయ్యా; కమనీయ = అందమైన; హరి = విష్ణుని; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల; రజస్ = ధూళిచేత; అభిసంస్కృత = మిక్కిలి చక్కజేయబడిన; శరీరులనున్ = దేహములు కలవారు; యాదృచ్ఛికముగన్ = తనంతటతను; సంప్రాప్తము = లభించినది; అగు = అయిన; దానన్ = దానితో; సంతుష్ట = సంతృప్తిపడిన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; వఱలుచున్ = తిరుగుతూ; ఉండు = ఉండెడి; మీ = మీ; వంటి = లాంటి; వారు = వారు; తగన్ = తగి; భగవత్ = భగవంతుని; పాద = పాదముల; దాస్యంబున్ = సేవ; తక్కంగ = తప్పించి; ఇతర = ఇతరమైన; పదార్థంబుల = వస్తువులు; ఎడదలు = హృదయముల; అందున్ = లో.
మఱచియునున్ = మరిచిపోయి యైన; కోరన్ = కోరుటను; ఒల్లరు = ఒప్పుకొనరు; మనుచరిత్ర = మనువు వంటి చరిత్రకలవాడ; తవిలి = పూని; ఇట్లు = ఈ విధముగ; హరి = విష్ణుని; ప్రసాదంబున్ = అనుగ్రహమును; ఒంది = పొంది; మరలి = తిరిగి; వచ్చుచునున్న = వస్తున్న; కుమారు = పుత్రుని; వార్త = సమాచారము; చారున్ = వేగుల; చేన్ = వలన; విని = విని; ఉత్తానచరణుడు = ఉత్తానపాదుడు; అపుడు = అప్పుడు.

భావము:

అని ఈ విధంగా ధ్రువుడు విచారించాడు ” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు “నాయనా! పావనమైన శ్రీహరి పాదపద్మాల పరాగంతో అలంకరింపబడిన శరీరం కలిగిన మీవంటివాళ్ళు తనంత తాను దొరికే దానితోనే సంతృప్తిపడతారు. భగవంతుని పాదసేవను తప్ప మరొకటి కోరుకొనరు. విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది కన్నకొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తను ఉత్తానపాదుడు చారుల వల్ల విని...