పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

 •  
 •  
 •  

4-301-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని యిట్లు చింతించె"నుచు నమ్మైత్రేయ-
ముని విదురునకు నిట్లనియెఁ "దండ్రి!
మనీయ హరిపాద మల రజోభి సం-
స్కృత శరీరులును యాదృచ్ఛికముగ
సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై-
ఱలుచు నుండు మీవంటి వారు
గ భగవత్పాద దాస్యంబు దక్కంగ-
నితర పదార్థంబు లెడఁద లందు"

4-301.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱచియును గోర నొల్లరు నుచరిత్ర!
విలి యిట్లు హరిప్రసాదంబు నొంది
రలి వచ్చుచునున్న కుమారు వార్తఁ
జారుచే విని యుత్తానరణుఁ డపుడు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; చింతించెన్ = విచారించెను; అనుచున్ = అంటూ; మైత్రేయ = మైత్రేయుడు అనెడి; ముని = ముని; విదురున్ = విదురుని; కున్ = కి; ఇట్లు = ఈవిథముగ; అనియె = పలికెను; తండ్రీ = అయ్యా; కమనీయ = అందమైన; హరి = విష్ణుని; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల; రజస్ = ధూళిచేత; అభిసంస్కృత = మిక్కిలి చక్కజేయబడిన; శరీరులనున్ = దేహములు కలవారు; యాదృచ్ఛికముగన్ = తనంతటతను; సంప్రాప్తము = లభించినది; అగు = అయిన; దానన్ = దానితో; సంతుష్ట = సంతృప్తిపడిన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; వఱలుచున్ = తిరుగుతూ; ఉండు = ఉండెడి; మీ = మీ; వంటి = లాంటి; వారు = వారు; తగన్ = తగి; భగవత్ = భగవంతుని; పాద = పాదముల; దాస్యంబున్ = సేవ; తక్కంగ = తప్పించి; ఇతర = ఇతరమైన; పదార్థంబుల = వస్తువులు; ఎడదలు = హృదయముల; అందున్ = లో.
మఱచియునున్ = మరిచిపోయి యైన; కోరన్ = కోరుటను; ఒల్లరు = ఒప్పుకొనరు; మనుచరిత్ర = మనువు వంటి చరిత్రకలవాడ; తవిలి = పూని; ఇట్లు = ఈ విధముగ; హరి = విష్ణుని; ప్రసాదంబున్ = అనుగ్రహమును; ఒంది = పొంది; మరలి = తిరిగి; వచ్చుచునున్న = వస్తున్న; కుమారు = పుత్రుని; వార్త = సమాచారము; చారున్ = వేగుల; చేన్ = వలన; విని = విని; ఉత్తానచరణుడు = ఉత్తానపాదుడు; అపుడు = అప్పుడు.

భావము:

అని ఈ విధంగా ధ్రువుడు విచారించాడు ” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు “నాయనా! పావనమైన శ్రీహరి పాదపద్మాల పరాగంతో అలంకరింపబడిన శరీరం కలిగిన మీవంటివాళ్ళు తనంత తాను దొరికే దానితోనే సంతృప్తిపడతారు. భగవంతుని పాదసేవను తప్ప మరొకటి కోరుకొనరు. విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది కన్నకొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తను ఉత్తానపాదుడు చారుల వల్ల విని...

4-302-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మనమున నిట్లని తలంచె.

టీకా:

మనమునన్ = మనసులో; ఇట్లు = ఈ విధముగ; అని = అని; తలంచె = అనుకొనెను.

భావము:

మనస్సులో ఇలా తలంచాడు.

4-303-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చ్చిన వారలుఁ గ్రమ్మఱ
చ్చుటయే కాక యిట్టి వార్తలు గలవే?
నిచ్చలు నమంగళుఁడ నగు
నిచ్చట మఱి నాకు శుభము లేల ఘటించున్.

టీకా:

చచ్చిన = చనిపోయిన; వారలు = వారు; క్రమ్మఱన్ = మరల; వచ్చుటయే = రావటమే; కాక = కాకుండగ; ఇట్టి = ఇటువంటి; వార్తలు = సమాచారములు; కలవే = ఉన్నవా ఏమి; నిచ్చలున్ = నిత్యము; అమంగళుండను = అశుభకరుడను; అగు = అయిన; ఇచ్చటన్ = ఇక్కడ; మఱి = మరి; నా = నా; కున్ = కు; శుభములు = శుభములు; ఏలన్ = ఏవిధముగ; ఘటించున్ = సంభవించును.

భావము:

చచ్చినవారు తిరిగి రావడం అనే చోద్యం ఎక్కడైనా ఉందా? అన్నివిధాల నిర్భాగ్యుడనైన నాకు అంతటి అదృష్టం ఎలా లభిస్తుంది?

4-304-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని విశ్వసింపకుండియు
మున నా నారదుఁడు గుమారుఁడు వేగం
బునఁ రాఁగలఁ డనుచును బలి
కి పలుకులు దలఁచి నమ్మి కృతకృత్యుండై.

టీకా:

అని = అని; విశ్వసింపకుండియు = నమ్మకపోయినప్పటికిని; మనమునన్ = మనస్సులో; ఆ = ఆ; నారదుడు = నారదుడు; కుమారుడు = సుతుడు; వేగంబునన్ = తొందరలోనే; రాగలడు = వచ్చును; అనుచున్ = అంటూ; పలికిన = చెప్పిన; పలుకులున్ = మాటలను; తలచి = తలచికొని; నమ్మి = నమ్మి; కృతకృత్యుండు = సఫలీకృతుడు {కృతకృత్యుండు - చేయవలసినది నెరవేర్చినవాడు, ధన్యుడు}; ఐ = అయ్యి.

భావము:

(ధ్రువుడు మరలి వస్తున్నాడు) అని ముందు నమ్మనివాడై “నీ కొడుకు తొందరలోనే తిరిగివస్తాడు” అని పూర్వం నారదుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని అటువంటి అదృష్టం లభిస్తుందేమో అని కొంత విశ్వసించి...

4-305-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సుతుని రాక చెప్పిన
నునకు ధనములును మౌక్తిపు హారములున్
మలర నిచ్చి తనయునిఁ
నుఁగొను సంతోష మాత్మఁ డలుకొనంగన్

టీకా:

తన = తన యొక్క; సుతుని = పుత్రుని; రాక = వచ్చుటను; చెప్పిన = చెప్పిన; ఘనునకున్ = గొప్పవానికి; ధనములును = డబ్బులు; మౌక్తికపు = ముత్యాల; హారములున్ = హారములు; మనమునన్ = మనసు; అలరన్ = సంతోషించునట్లుగ; ఇచ్చి = ఇచ్చి; తనయునిన్ = పుత్రుని; కనుగొను = చూసెడి; సంతోషము = సంతోషము; ఆత్మన్ = మనసున; కడలుకొనగన్ = ఉప్పొంగగ.

భావము:

తన కొడుకు వస్తున్నాడని చెప్పిన చారునకు ధనం, ముత్యాల దండలు సంతోషంగా ఇచ్చి, కొడుకును చూడాలనే ఉత్సాహం మనస్సులో ఉప్పొంగగా...

4-306-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లను మీఱిన సైంధవంబులఁ బూన్చిన-
నక రథంబు నుత్కంఠ నెక్కి
బ్రాహ్మణ కుల వృద్ధ బంధు జనామాత్య-
రివృతుం డగుచు విస్ఫుణ మెఱసి
బ్రహ్మనిర్ఘోష తూర్యస్వన శంఖ కా-
ళ వేణు రవము లందంద చెలఁగ
శిబిక లెక్కియు విభూషితలై సునీతి సు-
రుచు లుత్తముండు నారూఢి నడువ

4-306.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిమ దీపింప నతిశీఘ్రమన మొప్ప
నాత్మనగరంబు వెలువడి రుగుచుండి
లసి నగరోపవన సమీపంబు నందు
చ్చు ధ్రువుఁ గని మేదినీశ్వరుఁడు నంత.

టీకా:

వలనుమీఱిన = వడిగల; సైంధవంబులన్ = గుర్రములను; పూన్చిన = పూన్చిన; కనక = బంగారు; రథంబున్ = రథమును; ఉత్కంఠను = ఉత్సాహముతో; ఎక్కి = ఎక్కి; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; కులవృద్ధ = వంశమున పెద్దలు; బంధు = చుట్టములు; జనా = ప్రజలు; అమాత్య = మంత్రులచే; పరివృతుండు = చుట్టునునున్నవాడు; అగుచున్ = అవుతూ; విస్పురణన్ = వైభవముతో; మెఱసి = విలసిల్లి; బ్రహ్మనిర్ఘోష = వేదఘోష; తూర్యస్వన = వాయిద్యముల శబ్దములు; శంఖ = శంఖము; కాహళ = బాకాలు; వేణు = వేణువుల; రవములున్ = శబ్దములు; అందంద = మరిమరి; చెలగన్ = చెలరేగగ; శిబికలు = పల్లకీలు; ఎక్కియు = ఎక్కి; విభూషితలు = అలంకరింపబడినవారు; ఐ = అయ్యి; సునీతి = సునీతి; సురుచులు = సురుచియును; ఉత్తముండు = ఉత్తముడును; ఆరూఢిన్ = ఎక్కి; నడువ = అనుసరింపగ.
గరిమ = వైభవము; దీపింపన్ = ప్రకాశిస్తుండగ; అతి = మిక్కిలి; శీఘ్ర = వేగవంతమైన; గమనము = ప్రయాణము; ఒప్పన్ = ఒప్పుతుండగ; ఆత్మ = స్వంత; నగరంబున్ = నగరమునుండి; వెలువడి = బయవుదేరి; అరుగుచుండి = వెళ్ళుతూ; బలిసి = గుంపుగ; నగర = నగరముయొక్క; ఉపవనమునన్ = వెలుపలి తోట; సమీపమునందు = దగ్గరలో; వచ్చు = వస్తున్న; ధ్రువున్ = ధ్రువుని; కని = చూసి; మేదినీశ్వరుడు = రాజు {మేదినీశ్వరుడు - మేదిని (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}; అంత = అంతట.

భావము:

వడిగల గుఱ్ఱాలను పూన్చిన బంగారు రథాన్ని ఆత్రంగా ఎక్కి, బ్రాహ్మణులతో కులవృద్ధులతో బంధు మిత్రులతో మంత్రులతో కలసి బయలుదేరాడు. వేదఘోషలు, వాద్యధ్వనులు, శంఖ కాహళ వేణు నాదాలు అతిశయించాయి. పెద్దభార్య సునీతి, చిన్నభార్య సురుచి బంగారు పల్లకీలెక్కి ఉత్తమునితో కూడి అనుసరించారు. అలా వేగంగా ముందుకు సాగి వెళ్తూ పురం వెలుపల ఉపవనం సమీపాన అల్లంత దూరంనుండి వస్తున్న ధ్రువకుమారుణ్ణి ఉత్తానపాదుడు చూచి...

4-307-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దము డిగ్గి ప్రేమ దొలఁకాడ ససంభ్రముఁడై రమామనో
రు చరణారవింద యుగళార్చన నిర్దళితాఖి లాఘు నీ
శ్వ కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతుం
మనురక్తి డాసి పులకల్ ననలొత్తఁ బ్రమోదితాత్ముఁడై.

టీకా:

అరదము = రథము; డిగ్గి = దిగి; ప్రేమ = ప్రేమ; తొలకాడ = తొణికిసలాడ; ససంభ్రముడు = మిక్కిలి కుతూహలము కలవాడు; ఐ = అయ్యి; రమామనోహరు = హరి {రమా మనోహరుడు - రమ (లక్ష్మీదేవి) మనోహరుడు (భర్త), విష్ణువు}; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; యుగళ = జంటను; అర్చన = పూజించుటచే; నిర్దళిత = చక్కగ భేదించబడిన; అఖిల = సమస్తమైన; అఘున్ = పాపములు కలవానిని; ఈశ్వర = హరి; కరుణ = దయతో; ఆలోకన = చూచుటచేత; సు = చక్కగ; జాత = కలిగిన; సమగ్ర = పరిపూర్తి చెందిన; మనోరథున్ = కోరికలు గలవానిని; సుతున్ = పుత్రుని; కరము = మిక్కిలి; అనురక్తిన్ = ప్రీతితో; డాసి = దగ్గరకు వెళ్ళి; పులకల్ = పులకరింతలు; ననలొత్త = చిగురించగ; ప్రమోదితాత్ముడు = సంతోషించిన మనసు కలవాడు; ఐ = అయ్యి.

భావము:

రథం దిగి, అనురాగం పొంగిపొరలగా సంభ్రమంతో ధ్రువునికి ఎదురువెళ్ళాడు. శ్రీపతి పాదపద్మాలను సేవించి పాపాలను పోగొట్టుకొని, ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల కోరికలు తీర్చుకున్న తన కుమారుని సమీపించి ప్రేమతో పులకించిపోతూ సంతోషంగా...

4-308-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బిగియఁ గౌఁగిటఁ జేర్చి నెమ్మొము నివిరి
శిరము మూర్కొని చుబుకంబు చేతఁ బుణికి
వ్యయానంద బాష్ప ధారాభిషిక్తుఁ
జేసి యాశీర్వదింప నా చిరయశుండు.

టీకా:

బిగియన్ = గట్టిగ; కౌగిటజేర్చి = కౌగిలించుకొని; నెఱి = నిండు; మొగమున్ = ముఖమును; నివిరి = నివిరి; శిరమున్ = తలను; మూర్కొని = వాసనచూసి; చుబుకంబున్ = గడ్డము; చేతన్ = చేతితో; పుణికి = పుణికి; అవ్యయ = అంతులేని; ఆనంద = ఆనందపు; బాష్ప = కన్నీటి; ధార = ధారలతో; అభిషిక్తున్ = తడసినవానిని; చేసి = చేసి; ఆశీర్వాదింపన్ = ఆశీర్వదించగ; ఆ = ఆ; చిర = మిక్కిలి; యశుండు = యశస్సు కలవాడు.

భావము:

గట్టిగా కౌగిలించుకొని, ముఖం నిమిరి, శిరస్సు మూర్కొని, గడ్డం పుణికి, జలజల ప్రవహించే ఆనందబాష్పాలతో పుత్రుని శిరస్సును అభిషేకించి ఉత్తానపాదుడు ఆశీర్వదించగా, చిరకీర్తివంతుడైన పుత్రుడు ఆ ధ్రువుడు...

4-309-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుని యాశీర్వచనము
యముఁ గైకొని ప్రమోదియై తత్పదముల్
ఫాలతలము సోఁకఁగ
వితులు గావించి భక్తి విహ్వలుఁ డగుచున్.

టీకా:

జనకుని = తండ్రి; ఆశీర్వచనమున్ = ఆశీర్వచనములు; అనయమున్ = ఆవశ్యము; కైకొని = స్వీకరించి; ప్రమోది = సంతోషించినవాడు; ఐ = అయ్యి; తత్ = అతని; పాదముల్ = పాదములను; తన = తన యొక్క; ఫాలతలము = నుదురు; సోకగన్ = తగులునట్లు; వినతులు = నమస్కారములు; కావించి = చేసి; భక్తిన్ = భక్తిచే; విహ్వలుడు = తూగుతున్నవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

తండ్రి దీవనలను అందుకొని ఆనందించి అతని పాదాలపై నుదురు మోపి భక్తి తన్మయుడై నమస్కరించాడు.

4-310-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నా సజ్జనాగ్రణి యైన ధ్రువుఁడు
ల్లులకు భక్తి వినతులు గ నొనర్చి
సురుచికిని మ్రొక్క నర్భకుఁ జూచి యెత్తి
గు మొగంబున నాలింగనంబు చేసి.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; సత్ = మంచి; జన = వారిలో; అగ్రణి = గొప్పవాడు; ఐన = అయిన; ధ్రువుడు = ధ్రువుడు; తల్లులకు = తల్లులకు; భక్తిన్ = భక్తితో; వినతులు = నమస్కారములు; తగన్ = తగ; ఒనర్చి = చేసి; సురుచి = సురుచి; కిని = కి; మ్రొక్క = నమస్కరించగ; అర్భకుని = పిల్లవానిని; చూచి = చూసి; యెత్తి = లేవనెత్తి; నగు = నవ్వు; మొగంబునన్ = ముఖముతో; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసి = చేసి.

భావము:

సజ్జనులలో గొప్పవాడైన ఆ ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు. సురుచి తనకు మ్రొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ అక్కున జేర్చుకొని...

4-311-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రమొప్ప నానంద ద్గద స్వరమున-
జీవింపు మనుచు నాశీర్వదించె;
గవంతుఁ డెవ్వనిపై మైత్రి పాటించు-
త్కృపానిరతిఁ బ్రన్నుఁ డగుచు
తనికిఁ దమయంత నుకూలమై యుండు-
ర్వభూతంబులు మతఁ బేర్చి
హిఁ దలపోయ నిమ్నప్రదేశములకు-
నయంబుఁ జేరు తోముల పగిది

భావము:

4-311.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గాన ఘను నమ్మహాత్ముని గారవించె
సురుచి పూర్వంబు దలఁపక సుజనచరిత!
విష్ణుభక్తులు ధరను బవిత్రు లగుట
వారి కలుగరు ధరణి నెవ్వారు మఱియు.

టీకా:

కరము = అతిశయించి; ఒప్పన్ = చక్కనైన; ఆనంద = ఆనందమువలన; గద్గదము = బొంగురుపోయిన; స్వరమున = గొంతుకతో; జీవింపుము = జీవింపుము; అని = అని; ఆశీర్వదించె = ఆశీర్వదించెను; భగవంతుడు = విష్ణువు; ఎవ్వని = ఎవని; పై = పైన; మైత్రి = స్నేహము; పాటించున్ = చూపునో; సత్ = మంచి; కృప = దయ యొక్క; నిరతి = శ్రద్ధతో; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; అగుచున్ = అవుతూ; అతనికిన్ = అతనికి; తమయంతన = తమంతతామే; అనుకూలము = అనుకూలము; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; సర్వ = సమస్తమైన; భూతంబులు = జీవులును; సమతన్ = సమత్వము; పేర్చి = అతిశయించగ; మహిన్ = భూమిపైన; తలపోయ = ఆలోచించినచో; నిమ్న = పల్లపు; ప్రదేశముల్ = చోటి; కున్ = కి; అనయంబున్ = అవశ్యము; చేరు = చేరెడి; తోయములన్ = నీటి; పగిది = పగిదిన్; కాన = కావున.
ఘనున్ = గొప్పవానిని; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముని; గారవించె = గౌరవించెను; సురుచి = సురుచి; పూర్వంబున్ = పాత సంగతులు; తలపక = స్మరించక; సుజనచరిత = మంచివారి నడవడిక గలవాడ; విష్ణుభక్తులు = విష్ణుమూర్తి యొక్క భక్తులు; ధరనున్ = భూమికి; పవిత్రులు = పవిత్రమైనవారు; అగుటన్ = అవుటచేత; వారి = వారి; కిన్ = కి; అలుగరు = కోపించరు; ధరణిన్ = భూమిపైన; ఎవ్వారున్ = ఎవరుకూడ; మఱియు = ఇంకను.

భావము:

(సురుచి) ఆనందంతో వణుకుతున్న కంఠస్వరంతో “చిరంజీవ!” అని దీవించింది. పల్లమునకు నీళ్ళు ప్రవహించిన విధంగా భగవంతుని దయకు పాత్రుడైన వాని వద్దకు అందరూ తమంత తామే అనుకూల భావంతో చేరుకుంటారు. అందువల్లనే సురుచి గతాన్ని మరచిపోయి మహనీయుడైన ధ్రువుణ్ణి గౌరవించింది. నాయనా, విదురా! విష్ణుభక్తులు పరమపవిత్రులు. వారికి శత్రువులంటూ ఎవరూ ఉండరు. వారిపై ఎవ్వరూ కోపించరు.

4-312-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున నుత్తముండును ధ్రువుండును బ్రేమ విహ్వలు లగుచు నన్యో న్యాలింగితులై పులకాంకురాలంకృత శరీరులై యానంద బాష్పముల నొప్పి; రంత సునీతియుం దన ప్రాణంబులకంటెఁ బ్రియుండైన సుతు నుపగూహనంబు చేసి తదవయవ స్పర్శనంబు చేత నానందంబు నొంది విగతశోక యయ్యె; నప్పుడు సంతోష బాష్ప ధారాసిక్తంబులై చనుఁబాలునుం గురిసె నంత.

టీకా:

కావునన్ = అందుచేత; ఉత్తముండును = ఉత్తముడును; ధ్రువుండును = ధ్రువుడును; ప్రేమ = ప్రేమతో; విహ్వలులు = చలిస్తున్నవారు; అగుచున్ = అవుతూ; అన్యోన్య = ఒకరినొకరు; ఆలింగితులు = కౌగలించుకొన్నవారు; ఐ = అయ్యి; పులకా = పులకరింతలు; అంకుర = చిగురించుట అనెడి; అలంకృత = అలంకారము ధరించిన; శరీరులు = దేహములు కలవారు; ఐ = అయ్యి; ఆనంద = ఆనందము వలని; బాష్పములన్ = ఆశ్రువులచే; ఒప్పిరి = ఒప్పి యుండిరి; అంతన్ = అంత; సునీతియున్ = సునీతి; తన = తన యొక్క; ప్రాణంబుల్ = ప్రాణములు; కంటెన్ = కంటె; ప్రియుండు = ఇష్టుడు; ఐన = అయిన; సుతున్ = పుత్రుని; ఉపగూహనంబున్ = కౌగలింతలు; చేసి = చేసి; తత్ = అతని; అవయవ = అవయవముల; స్పర్శనంబున్ = స్పర్సించుట; చేతన్ = చే; ఆనందంబునున్ = సంతోషమును; ఒంది = పొంది; విగత = పోయిన; శోక = శోకము కలది; అయ్యెన్ = అయినది; అప్పుడు = అప్పుడు; సంతోష = ఆనంద; బాష్ప = ఆశ్రువుల; ధారా = ధారలతో; సిక్తంబులు = తడసినవి; ఐ = అయ్యి; చనుబాలునున్ = స్తన్యముకూడ; కురిసెన్ = కురిసినది; అంతన్ = అంతట.

భావము:

కనుక, ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో ఒడలు మరచి ఒకరినొకరు కౌగలించుకున్నారు. వారి శరీరాలు పులకరించాయి. వారి కనులలో ఆనంద బాష్పాలు నిండాయి. అప్పుడు సునీతి తన ప్రాణాలకంటే ఎక్కువ ప్రీతిపాత్రుడైన కొడుకును గట్టిగా కౌగిలించుకొని అతని తనూస్పర్శ వల్ల కలిగిన సంతోషంతో తన దుఃఖాన్ని మరిచిపోయింది. ఆనందబాష్పాలతో తడిసిన ఆ తల్లి పాలిండ్లు పొంగులెత్తాయి.

4-313-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న్నత సంతోష ముప్పతిల్లఁగఁ బౌర-
ము లా ధ్రువుతల్లి నెయఁ జూచి
"తొడరిన భవదీయ దుఃఖనాశకుఁ డైన-
యిట్టి తనూజుఁ డెందేని పెద్ద
కాలంబు క్రిందటఁ డఁగి నష్టుం డైన-
వాఁడిప్డు నీ భాగ్యశము చేతఁ
బ్రతిలబ్ధుఁ డయ్యెను; నితఁడు భూమండల-
మెల్లను రక్షించు నిద్ధమహిమ;

4-313.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మల లోచనుఁ జింతించు నులు లోక
దుర్జయం బైన యట్టి మృత్యువును గెల్తు;
ట్టి ప్రణతార్తి హరుఁడైన బ్జనాభుఁ
ర్థి నీచేతఁ బూజితుం గుట నిజము."

టీకా:

ఉన్నత = అదికమైన; సంతోషమున్ = ఆనందము; ఉప్పతిల్లగన్ = పొంగిపొర్లిపోగా; పౌరజనములు = పౌరులు; ఆ = ఆ; ధ్రువు = ధ్రువుని; తల్లిన్ = తల్లిని; ఎనయన్ = పొందికగ; చూచి = చూసి; తొడరిన = కలిగిన; భవదీయ = నీ యొక్క; దుఃఖ = దుఃఖమును; నాశకుడు = నాశనముచేసిన వాడు; ఐన = అయిన; ఇట్టి = ఇటువంటి; తనూజుడు = పుత్రుడు {తనూజుడు - తనువున పుట్టినవాడు, పుత్రుడు}; ఎందేని = ఎక్కడైన; పెద్ద = చాలా; కాలంబు = కాలము; క్రిందటన్ = కిందట; కడగి = పూని; నష్టుండు = పోయినవాడు; ఐన = అయిన; వాడు = వాడు; ఇప్డు = ఇప్పుడు; నీ = నీ యొక్క; భాగ్యవశము = అదృష్టము; చేతన్ = కొలది; ప్రతిలబ్దుడు = తిరిగిదొరకినవాడు; అయ్యెను = ఆయెను; ఇతడున్ = ఇతడు; భూమండలము = మొత్తము భూలోకము; ఎల్లను = సమస్తమును; రక్షించు = కాపాడు; ఇద్ధ = ప్రసిద్ధ; మహిమన్ = మహిమతో.
కమలలోచను = విష్ణుని; చింతించు = ధ్యానించు; ఘనులు = గొప్పవారు; లోక = లోకమంతటను; దుర్జయంబు = జయింపరానిది; ఐన = అయిన; అట్టి = అటువంటి; మృత్యువునున్ = మృత్యువును కూడ; గెల్తురు = గెలుస్తారు; అట్టి = అటువంటి; ప్రణత = ప్రపన్నులైన భక్తుల; ఆర్తి = బాధను; హరుడు = హరించువాడు; ఐన = అయిన; అబ్జనాభుడు = విష్ణువు {అబ్జనాభుడు - అబ్జము (పద్మము) నాభిన కలవాడు, విష్ణువు}; అర్థిన్ = కోరి; నీ = నీ; చేతన్ = చేత; పూజితుడు = పూజింపబడినవాడు; అగుటన్ = అయియుండుట; నిజము = నిజము.

భావము:

పురజనులు ధ్రువుని తల్లియైన సునీతిని చూచి అంతులేని సంతోషంతో “చాలాకాలం క్రిందట కనిపించకుండా పోయిన నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్ళీ తిరిగి వచ్చాడు. నీ దుఃఖాన్ని తొలగించాడు. ఇతడు సాటిలేని పరాక్రమంతో భూమండలాన్ని పరిపాలిస్తాడు. విష్ణువును సేవించే మహాత్ములు అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ప్రపన్నులైన భక్తుల దుఃఖాన్ని తొలగించే నారాయణుని నీవు నిజంగా ఆరాధించావు.”

4-314-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని ప్రశంసించి; రట్లు పౌరజనంబులచేత నుపలాల్య మానుండగు ధ్రువుని నుత్తానపాదుం డుత్తమ సమేతంబుగా గజారూఢునిం జేసి సంస్తూయమానుండును, ప్రహృష్టాంతరంగుండును నగుచుఁ బురాభిముఖుండై చనుదెంచి.

టీకా:

అని = అని; ప్రశంసించిరి = పొగిడిరి; అట్లు = అలా; పౌరజనంబుల = పౌరుల; చేతన్ = చేత; ఉపలాల్యమానుండు = బుజ్జగింపబడుతున్నవాడు; అగు = అయిన; ధ్రువుని = ధ్రువుని; ఉత్తానపాదుడు = ఉత్తానపాదుడు; ఉత్తమ = ఉత్తముని; సమేతంబుగా = తో కూడ; గజా = ఏనుగును; ఆరూఢునిన్ = ఎక్కినవానిగా; చేసి = చేసి; సంస్తూయమానుండునున్ = స్తుతింపబడుతున్నవాడును; ప్రహృష్ట = సంతోషముతో కూడిన; అంతరంగుండు = అంతరంగము కలవాడు; అగుచున్ = అవుతూ; పుర = నగరము; అభిముఖుండు = వైపునకు పోవువాడు; ఐ = అయ్యి; చనుదెంచి = వచ్చి.

భావము:

అని పౌరజనులు ప్రశంసించారు. ఆ విధంగా పౌరులచేత ఉపలాలింప బడుతున్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా ఏనుగుపైన కూర్చుండ బెట్టి, ప్రజల ప్రస్తుతులను అందుకుంటూ మనస్సులో పొంగిపొరలే సంతోషంతో పురం వైపు బయలుదేరి వచ్చి…

4-315-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

స్వర్ణ పరిచ్ఛదస్వచ్ఛకుడ్యద్వార-
లాలిత గోపురాట్టాలకంబు;
ల పుష్ప మంజరీ లిత రంభా స్తంభ-
పూగ పోతాది విభూషితంబు;
న సార కస్తూరికా గంధ జలబంధు-
రాసిక్త విపణి మార్గాంచితంబు;
మానిత నవరత్న య రంగవల్లీ వి-
రాజిత ప్రతి గృహ ప్రాంగణంబు;

4-315.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శుభ నదీజల కుంభ సంశోభితంబు;
తండులస్వర్ణలాజాక్షప్రసూన
ల బలివ్రాత కలిత విభ్రాజితంబు;
గుచు సర్వతోలంకృత మైన పురము.

టీకా:

స్వర్ణ = బంగారు; పరిచ్ఛద = ఇండ్ల పైకప్పులు; స్వచ్ఛ = నిర్మలమైన; కుడ్య = గోడలు; ద్వార = గుమ్మములు; లాలిత = అందమైన; గోపుర = గోపురములు; అట్టాలకంబున్ = కోటబురుజులు కలది; ఫల = పండ్లు; పుష్ప = పువ్వులు; మంజరీ = పూలగుత్తులు; కలిత = కూడిన; రంభా = అరటి; స్తంభ = స్తంభములు; పూగపోత = పోకచెట్లబోదెలు; ఆది = మొదలగు; విభూషితంబున్ = చక్కగా అలంకరిపబడినది; ఘనసార = కర్పూరము; కస్తూరికా = కలస్తూరిలతోకూడిన; గంధ = సువాసనల; జల = నీటిచో; బంధుర = చిక్కగా; ఆసిక్త = బాగుగా తడపబడిన; విపణి = వాణిజ్యపు; మార్గ = దారి; అంచితంబున్ = అలంకరింపబడినది; మానిత = గౌరవింపదగ్గ; నవరత్న = నవరత్నములతో {నవరత్నములు - 1మౌక్తికము (ముత్యము) 2పద్మరాగము 3వజ్రము 4ప్రవాళము 5మరకతము 6నీలము 7గోమేధికము 8పుష్యరాగము 9వైఢూర్యము}; మయ = కలిగిన; రంగవల్లీ = ముగ్గులతో; విరాజిత = విసిల్లుతున్న; ప్రతి = ప్రతి; గృహ = గృహము యొక్క; ప్రాగణంబు = ముంగిలులుకలది.
శుభ = శుభమైన; నదీ = నది; జల = నీటి; కుంభ = కుండలతో; సంశోభితంబున్ = చక్కగాశోభిల్లుతున్నది; తండుల = బియ్యము; స్వర్ణ = బంగారము; లాజ = పేలాల; అక్షత = అక్షతలు; ప్రసూన = పూలు; ఫల = పండ్లు; బలి = బలుల; వ్రాత = సమూహముల; కలిత = కూడి; విభ్రాజితంబున్ = ప్రకాశిస్తున్నది; అగుచున్ = అవుతూ; సర్వతః = అన్నిదిక్కులను, అన్నిరకములుగ; అలంకృతము = అలంకరింపబడినది; ఐన = అయిన; పురమున్ = నగరమును.

భావము:

గోడలు, తలుపులు, గోపురాలు బంగారు పూతతో తళతళ మెరుస్తున్నాయి. పండ్లతోను పూలగుత్తులతోను నిండిన అరటి స్తంభాలు, చిన్న చిన్న పోకచెట్లు వీధికి ఇరువైపుల కనువిందు చేస్తున్నాయి. అంగళ్ళముందు పచ్చకర్పూరం, కస్తూరి, చందనం కలిపిన నీళ్ళు చల్లారు. ప్రతి ఇంటి ముంగిట్లోను నవరత్నాలతో ముగ్గులు తీర్చి దిద్దారు. పవిత్ర నదీజలాలతో నిండిన మంగళ కలశాలు నిలిపారు. బంగారు లాజలు, అక్షతలు, పూలు, పండ్లు పూజాద్రవ్యాలు సిద్ధపరిచారు. ఈ విధంగా అలంకరింపబడిన పట్టణంలోకి…

4-316-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రవేశించి రాజమార్గంబునఁ జనుదెంచు నప్పుడు.

టీకా:

ప్రవేశించి = ప్రవేశించి; రాజమార్గంబునన్ = ప్రధానవీథిలో; చనుదెంచు = వెళ్ళెడి; అప్పుడు = సమయమున.

భావము:

అలా ఉత్తానపాదుడు తన కొడుకు ధ్రువునితో ప్రవేశించి రాజమార్గం గుండా వస్తున్న సమయంలో…

4-317-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిమధ్యల్ పురకామినీ తతులు సౌధాగ్రంబులందుండి భా
స్వ సిద్ధార్థ ఫలాక్షతప్రసవ దూర్వావ్రాత దధ్యంబువుల్
వల్లీ మణి హేమ కంకణ ఝణత్కారంబు శోభిల్లఁ జ
ల్లిరి యా భాగవతోత్తమోత్తమునిపై లీలాప్రమేయంబుగన్.

టీకా:

హరి = సింహమువంటి {హరిమధ్యలు - హరి (సింహము) వంటి మధ్యలు (నడుములు కలవారు), స్త్రీలు}; మధ్యల్ = నడుముల కలవారు; పుర = నగర; కామినీ = స్త్రీ; తతులు = సమూహములు; సౌధా = మేడల; అగ్రంబులన్ = పైన; ఉండి = ఉండి; భాస్వర = తళుకుమంటున్న; సిధ్ధార్థ = తెల్లావాలు; ఫల = పండ్లు; అక్షత = అక్షింతలు; ప్రసవ = పూలు; దూర్వా = గరికల; వ్రాత = కూడిన; దధి = పెరుగు; అంబువుల్ = నీళ్ళు; కర = చేతులు అనెడి; వల్లీ = పూలతీగల; మణి = మణులుపొదిగిన; హేమ = బంగారు; కంకణ = కంకణముల; ఝణత్కారంబున్ = ఝణఝణ మనెడి ధ్వనులు; శోభిల్లన్ = శోభిల్లుతుండగ; చల్లిరి = చల్లిరి; ఆ = ఆ; భాగవత = భాగవతులలో; ఉత్తమోత్తము = అత్యుత్తము; పైన్ = పైని; లీలా = విలాసముల; ప్రమేయంబుగాన్ = సంగతులుగా.

భావము:

సన్నని సింగపు నడుములు గల పురస్త్రీలు ఒయ్యారంగా మేడలపై నిలబడి, చేతులకు ధరించిన మణులు తాపిన బంగారు గాజులు ఝణఝణ ధ్వనులు చేస్తుండగా ఆ ఉత్తమోత్తముడైన భగవద్భక్తునిపై తెల్లావాలు, పండ్లూ, పూలు, అక్షతలు, దూర్వాంకురాలు, పెరుగు కలిపిన నీళ్ళను చల్లారు.

4-318-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణి దీప నీరాజనంబుల నివాళింపం బౌర జానపద మిత్రామాత్య బంధుజన పరివృతుండై చనుదెంచి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వాత్సల్యంబునన్ = అభిమానముతో; జల్లుచున్ = జల్లతూ; సత్యవాక్యంబులన్ = సత్యవాక్యములతో; దీవించుచున్ = దీవిస్తూ; సువర్ణ = బంగారు; పాత్ర = పాత్రలుచే; రచిత = చేసిన; మణిదీప = మణిదీపముల; నీరాజనంబులన్ = మంగళహారతులను; నివాళింపన్ = హారతు లివ్వగా; పొర = పౌరులు; జానపద = జానపదులు; మిత్ర = మిత్రులు; అమాత్య = మంత్రులు; బంధు = బంధువులు; జన = ప్రజలుచే; పరివృతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; చనుదెంచి = వచ్చి.

భావము:

ఈ విధంగా ప్రేమతో చల్లుతూ యథార్థవాక్కులతో దీవిస్తూ, బంగారు పాత్రలలో మణిదీపాలుంచి హారతు లివ్వగా ధ్రువుడు పౌరులతో, జానపదులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ముందుకు సాగి…

4-319-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాంచన మయ మరత కుడ్య మణిజాల-
సంచయ రాజిత సౌధములను
రసుధాఫేన పాండుర రుక్మ పరికరో-
దాత్త పరిచ్ఛదల్పములను
సురతరు శోభిత శుక పిక మిథునాళి-
గాన విభాసి తోద్యానములను
సుమహిత వైడూర్య సోపాన విమల శో-
భిత జలపూర్ణ వాపీచయముల

4-319.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వికచ కహ్లార దర దరవింద కైర
ప్రదీపిత బక చక్రవాక రాజ
హంస సారస కారండవాది జల వి
హంగ నినదాభిరామ పద్మాకరముల.

టీకా:

కాంచన = బంగారమున; మయ = తాపిన; మరకత = పచ్చల; కుడ్య = గోడల; మణి = మణుల; జాల = కిటికీల; సంచయ = సమూహములుకలిగిన; రంజిత = ప్రకాశించు; సౌధములను = మేడలను; = వర = శ్రేష్టమైన; సుధా = అమృతపు; ఫేన = నురుగ వలె; పాండుర = తెల్లని; రుక్మ = బంగారపు; పరికర = చుట్టంచులుగల; ఉదాత్త = ఉత్తమమైన; పరిచ్ఛద = దుప్పట్లుగల; తల్పములను = మంచములును; = సురతరు = కల్పవృక్షములతో {సురతరువు - దేవతల చెట్టు, కల్పవృక్షము}; శోభిత = శోభిల్లుతున్న; శుక = చిలుకలు; పిక = నెమళ్ళు; మిధునా = జంటలు; ఆళి = తుమ్మెదల; గాన = గానములతో; విభాసిత = ప్రకాశిస్తున్న; ఉద్యానములను = ఉద్యానవనములును; = సు = మంచి; మహిత = గొప్ప; వైడూర్య = వైడూర్యముల; సోపాన = మెట్లుగల; విమల = నిర్మలముగ; శోభిత = శోభిస్తున్న; జల = నీటితో; పూర్ణ = నిండిన; వాపీ = నడబావుల, కోనేర్ల; చయముల = సమూహముల.
వికచ = వికసించిన; కహ్లార = ; దరత్ = అరవిచ్చిన; అరవింద = కమలములు; కైరవ = తెల్లకలువలతో; ప్రదీపిత = విరాజిల్లుతున్న; బక = కొంగ; చక్రవాక = చక్రవాకములు; రాజహంస = రాయంచలు; సారస = బెగ్గరు పక్షలు; కారండవ = కన్నెలేడి (నీటికాకి) పక్షులు; ఆది = మొదలగు; జల = నీటి పక్షుల; నినద = అరుపులతో; అభిరామ = మనోహరంబగుచున్న; పద్మాకరముల = సరస్సుల.

భావము:

ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. అక్కడి మేడలు పచ్చలు తాపిన బంగారు గోడలతోను, మణిఖచితాలైన గవాక్షాలతోను మెరిసిపోతున్నవి. పట్టెమంచాల పరుపులపై పాలనురుగువలె తెల్లనైన బంగారు జరీ అంచుల దుప్పట్లు పరచబడి ఉన్నాయి. ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండి చిలుకలు, కోయిలలు, తుమ్మెదల జంటలు పాడే పాటలతో మారుమ్రోగుతున్నాయి. దిగుడు బావులు వైడూర్యాలతో కట్టిన మెట్లతో నిర్మలమైన జలంతో నిండి ప్రకాశిస్తున్నాయి. వికసించిన కలువలతో, కమలాలతో విరాజుల్లుతూ కొక్కెరలు, జక్కవలు, రాయంచలు, బెగ్గురు పక్షులు, కన్నెలేళ్ళు మొదలైన నీటి పక్షుల కలకల ధ్వనులతో అక్కడి దొరువులు, చెరువులు అలరారుతున్నాయి.

4-320-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకను.

భావము:

ఇంకా…

4-321-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చారు బహువిధ వస్తు విస్తార మొప్ప
నంగనాయుక్త మగుచుఁ బెం గ్గలించి
ర్థిఁ దనరారు జనకుగృహంబు చొచ్చె
నెలమిఁ ద్రిదివంబు చొచ్చు దేవేంద్రు పగిది.

టీకా:

చారు = అందమైన; బహువిధ = అనేక; వస్తు = పదార్థములు; విస్తారమున్ = పుష్కలముగా; ఒప్పన్ = కలిగియుండి; అంగనా = స్త్రీలతో; యుక్తము = కూడినది; అగుచున్ = అవుతూ; పెంపగ్గలించి = అతిశయించి; అర్థిన్ = సంపదలతో; తనరారు = విలసిల్లుతున్న; జనకు = తండ్రి; గృహంబున్ = ఇంటిని; చొచ్చెన్ = ప్రవేశించెను; ఎలమిన్ = సంతోషముతో; త్రిదివంబున్ = స్వర్గమును {త్రిదివము – మూడవ లోకము, స్వర్గము}; చొచ్చు = ప్రవేశించు; దేవేంద్రు = దేవేంద్రుని; పగిదిన్ = వలె.

భావము:

ఎన్నెన్నో సుందర వస్తువులతోను, సుందరీమణులతోను కలకలలాడుతూ కనువిందు చేస్తున్న రాజప్రాసాదంలో స్వర్గంలో దేవేంద్రుడు ప్రవేశించినట్లు ధ్రువుడు ప్రవేశించాడు.

4-322-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు ప్రవేశించిన రాజర్షి యైన యుత్తానపాదుండు సుతుని యాశ్చర్యకరంబైన ప్రభావంబు వినియుం జూచియుం మనంబున విస్మయంబు నొంది ప్రజానురక్తుండును, బ్రజాసమ్మతుండును, నవయౌవ్వన పరిపూర్ణుండును నైన ధ్రువుని రాజ్యాభిషిక్తుం జేసి వృద్ధవయస్కుండైన తన్నుఁదాన యెఱింగి యాత్మగతిఁ బొంద నిశ్చయించి విరక్తుండై వనంబునకుం జనియె; నంత నా ధ్రువుండు శింశుమార ప్రజాపతి కూఁతురైన భ్రమి యను దాని వివాహంబై దానివలనఁ గల్ప, వత్సరు లను నిద్దఱు గొడుకులం బడసి; వెండియు వాయుపుత్రియైన యిల యను భార్య యందు నుత్కల నామకుఁడైన కొడుకు నతి మనోహర యైన కన్యకారత్నంబునుం గనియె; నంత దద్భ్రాత యైన యుత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షునిచేత హతుండయ్యె; నతని తల్లియుఁ దద్దుఃఖంబున వనంబున కేఁగి యందు గహనదహనంబున మృతిం బొందె; ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్షశోకవ్యాకులిత చిత్తుండై జైత్రంబగు రథంబెక్కి యుత్తరాభిముఖుండై చని హిమవద్ద్రోణి యందు భూతగణ సేవితంబును గుహ్యక సంకులంబును నైన యలకాపురంబు బొడగని యమ్మహాబాహుండు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రవేశించిన = ప్రవేశించగా; రాజర్షి = రాజులలో ఋషి; ఐన = అయిన; ఉత్తానపాదుండు = ఉత్తానపాదుడు; సుతుని = పుత్రుని; ఆశ్చర్యకరంబులు = ఆశ్చర్యమును కలిగించెడివి; ఐన = అయిన; ప్రభావంబులు = ప్రభావములను; వినియున్ = విని; చూచియున్ = చూసి; మనంబునన్ = మనసులో; విస్మయంబును = ఆశ్చర్యమును; ఒంది = పొంది; ప్రజ = ప్రజల యందు; అనురక్తుండును = అనురాగము కలవాడును; ప్రజా = ప్రజల; సమ్మతుండును = అంగీకార మైనవాడును; నవయౌవ్వన = నవయౌవ్వనముతో; పరిపూర్ణుండును = నిండుగ నున్నవాడును; ఐన = అయిన; ధ్రువునిన్ = ధ్రువుని; రాజ్యాభిషిక్తున్ = రాజ్యాభిషిక్తునిగా; చేసి = చేసి; వృద్ధ = ముసలి; వయస్కుండు = వయస్కుడు; ఐన = అయిన; తన్నుదాన = తననుతాను; ఎఱింగి = తెలుసుకొని; ఆత్మ = ఆత్మదర్శన; గతిన్ = మార్గమును; పొందన్ = పొందుటను; నిశ్చయించి = నిశ్చయించి; విరక్తుండు = వైరాగ్యము చెందినవాడు; ఐ = అయ్యి; వనంబున్ = అడవికి; చనియెన్ = వెళ్ళెను; అంతన్ = అంతట; ధ్రువుండు = ధ్రువుడు; శింశుమార = శింశుమార {శింశుమార చక్రము – గ్రహ నక్షత్ర మండలములు తిరిగెడు చక్రము}; ప్రజాపతి = ప్రజాపతి; కూతురు = పుత్రిక; ఐన = అయిన; భ్రమి = భ్రమి {భ్రమి – భ్రమించెడిది}; అను = అనెడి; దానిన్ = ఆమెని; వివాహంబున్ = పెండ్లి; ఐ = అయ్యి; దానిన్ = ఆమె; వలనన్ = అందు; కల్ప = కల్పుడును; వత్సరులు = వత్సరుడును {వత్సరము - సంవత్సరము}; అను = అనెడి; ఇద్దఱున్ = ఇద్దరిని; కొడుకులన్ = పుత్రులను; పడసి = పొంది; వెండియున్ = మరల; వాయు = వాయుదేవుని; పుత్రి = పుత్రిక; ఐన = అయిన; ఇల = ఇల; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; ఉత్కల = ఉత్కలుడు; నామకుడు = అనెడి పేరు కలవాడు; ఐన = అయిన; కొడుకున్ = పుత్రుని; అతి = మిక్కిలి; మనోహర = అందమైనది; ఐన = అయిన; కన్యకా = కన్యలలో; రత్నంబున్ = రత్నమువంటి ఆమెను; కనియెన్ = కనెను; అంతన్ = అంతట; తత్ = అతని; భ్రాత = సోదరుడు; ఐన = అయిన; ఉత్తముండు = ఉత్తముడు; వివాహంబున్ = పెండ్లి; లేకుండి = కాక యుండి; మృగయా = వేట; అర్థంబున్ = కోసము; వనంబున్ = అడవికి; అరిగి = వెళ్ళి; హిమవంతంబునన్ = హిమవత్పర్వతము నందు; యక్షుని = యక్షుని; చేతన్ = చేత; హతుండు = మరణించినవాడు; అయ్యెన్ = ఆయెను; అతని = అతని; తల్లియున్ = తల్లికూడ; తత్ = ఆ; దుఃఖంబునన్ = దుఃఖముతో; వనంబున్ = అడవికి; ఏగి = వెళ్ళి; అందున్ = అందులో; గహనదహనంబునన్ = కారుచిచ్చులో; మృతిన్ = మరణమును; పొందెన్ = పొందెను; ధ్రువుండు = ధ్రువుడు; భాత్రు = సోదరుని; మరణంబున్ = మరణమును; విని = విని; కోప = కోపము; అమర్ష = రోషము; శోక = దుఃఖములతో; వ్యాకులిత = చీకాకుపడిన; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; జైత్రంబు = జయించు లక్షణము కలది; అగు = అయిన; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; ఉత్తర = ఉత్తరపు దిక్కు; అబిముఖుండు = వైపు వెళ్ళువాడు; ఐ = అయ్యి; చని = వెళ్ళి; హిమవద్ద్రోణి = హిమాలయ పర్వతపంక్తి; అందున్ = అందు; భూత = భూతముల; గణ = సమూహములచే; సేవితంబునున్ = సేవింపబడుతున్నది; ఐన = అయిన; గుహ్యక = గుహ్యకులచే; సంకులంబున్ = వ్యాపించినది; ఐన = అయిన; అలకాపురంబున్ = అలకాపురమును; పొడగని = కాంచి; ఆ = ఆ; మహాబాహుండు = మహాపరాక్రమశాలి {మహాబాహుడు - గొప్ప బాహువులు కలవాడు, మహాపరాక్రమశాలి}.

భావము:

ఆ విధంగా ప్రవేశించగా రాజర్షి అయిన ఉత్తానపాదుడు అద్భుతమైన కొడుకు ప్రభావానికి ఆశ్చర్యపడ్డాడు. ధ్రువునకు ప్రజలపై గల అనురాగాన్ని, ప్రజలకు ధ్రువునిపై గల అభిమానాన్ని పరికించి నవయౌవనవంతుడైన ధ్రువుణ్ణి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసాడు. తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని సుగతిని పొందడానికి నిశ్చయించుకొని విరక్తుడై తపోవనానికి వెళ్ళాడు. ఆ తరువాత ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురయిన భ్రమిని వివాహమాడి ఆమెవల్ల కల్పుడు, వత్సరుడు అనె ఇద్దరు కొడుకులను పొందాడు. వాయు పుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఆమెవల్ల ఉత్కలుడు అనే కొడుకును, సౌందర్యవతి అయిన కూతురును పొందాడు. ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు పెండ్లి కాకముందే వేటాడటానికి హిమవత్పర్వత ప్రాంతంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఉత్తముని తల్లియైన సురుచి పుత్రదుఃఖంతో అడవికి వెళ్ళి అక్కడ కారుచిచ్చు మంటలలో చిక్కి మరణించింది. ధ్రువుడు తమ్ముని మరణవార్త విని కోపంతోను, దుఃఖంతోను కలత చెందిన మనస్సు కలవాడై జయశీలమైన రథాన్ని ఎక్కి ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. అక్కడ మంచుకొండ లోయలో భూతగణాలతోను, యక్షులతోను నిండిన అలకాపురాన్ని చూచి మహాపరాక్రమవంతుడైన ఆ ధ్రువుడు…