పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-300-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హీనుండు నృపాలుఁ జేరి మిగులన్ ధాటిన్ ఫలీకార మి
మ్మని యర్థించినరీతి ముక్తిఫలదుం డై నట్టి పంకేజలో
నుఁ డే చాలఁ బ్రసన్నుఁడైన నతనిన్ సాంసారికం బర్థిఁ గో
రి నావంటి విమూఢమానసులు ధాత్రిం గల్గిరే యెవ్వరున్?"

టీకా:

ధనహీనుండు = పేదవాడు; నృపాలున్ = రాజును {నృపాలుడు - నృ (నరులను) పాలించువాడు, రాజు}; చేరి = దగ్గరకు వెళ్ళి; మిగులన్ = మిక్కిలి; ధాటిన్ = ధాటిగా, గట్టిగా; ఫలీకారము = ఊకతో కూడిన నూకలు; ఇమ్ము = ఇమ్ము; అని = అని; అర్థించిన = కోరిన; రీతి = విధముగ; ముక్తిన్ = మోక్షమును; ఫలదుండు = ఫలితమును ఇచ్చువాడు; ఐనట్టి = అయినట్టి; పంకేజలోచనుఁడే = విష్ణుమూర్తే {పంకేజ లోచనుఁడు - పద్మముల వంటి కన్నులుగలవాడు, విష్ణువు}; చాలన్ = మిక్కిలి; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; ఐనన్ = అవ్వగా; అతనిన్ = అతనిని; సాంసారికంబు = సంసారమునకు సంబంధించినవి; అర్థిన్ = కావాలని; కోరిన = కోరినట్టి; నా = నా; వంటి = వంటి; విమూఢ = మిక్కిలి మూర్ఖపు; మానసులు = మనస్సు కలవారు; ధాత్రిన్ = భూమిని; కల్గిరే = ఉన్నారా ఏమి; ఎవ్వరున్ = ఎవరైనను.

భావము:

పేదవాడు రాజును సమీపించి ఊకతో కూడిన నూకలను ఇమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయిన కమలాక్షుడు నాకు ప్రసన్నుడైనా అతన్ని నేను సంసారాన్ని అర్థించాను. నావంటి మందబుద్ధులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు’ (అని ధ్రువుడు విచారించాడు).