పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-296-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఘ! పినతల్లి దన్నుఁ బల్కి దురుక్తి
బాణవిద్ధాత్ముఁ డగుచుఁ దద్భాషణములు
చిత్తమందుఁ దలంచుటఁ జేసి ముక్తిఁ
గోరమికి నాత్మలో వగఁ గూరుచుండె.

టీకా:

అనఘ = పుణ్యుడ; ఆ = ఆ; పినతల్లి = పినతల్లి; తన్ను = తనను; పల్కిన = అనిన; దురుక్తి = తిట్లు అనెడి; బాణ = బాణములచే; విద్ధాత్ముడు = గాయ పడ్డ మనసు కల వాడు; అగుచున్ = అవుతూ; తత్ = ఆ; భాషణములు = పలుకులు; చిత్తము = మనసు; అందున్ = లో; తలంచుటన్ = తలచుట; చేసి = వలన; ముక్తిన్ = ముక్తిని; కోరమికిన్ = కోరుకొనకుండుటకు; ఆత్మ = మనసు; లోన్ = లో; వగన్ = విచారములో; కూరుచుండె = కూరుకుపోతుండెను.

భావము:

“పుణ్యాత్మా! పినతల్లి ఆడిన దుర్భాషలు అనే బాణాలచేత ధ్రువుని మనస్సు బాగా గాయపడింది. అందుచేత ఆ దుర్భాషలనే మాటిమాటికి స్మరిస్తూ హరి ప్రత్యక్షమైనపుడు ముక్తిని కోరలేకపోయాడు. అందుకే అతడు మనస్సులో పరితపిస్తున్నాడు.