పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-293-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని మైత్రేయుఁడు ధ్రువుఁ డ
ట్లయము హరిచేఁ గృతార్థుఁడైన విధం బె
ల్లను వినిపించిన విదురుఁడు
విని మునివరుఁ జూచి పలికె వినయం బెసఁగన్.

టీకా:

అని = అని; మైత్రేయుడు = మైత్రేయుడు; ధ్రువుడు = ధ్రువుడు; అట్లు = ఆ విధముగ; అనయము = పూర్తిగ; హరి = విష్ణువు; చేన్ = చేత; కృతార్థుడు = కోరినది పొందినవాడు; ఐన = అయిన; విధంబున్ = విధము; ఎల్లను = అంతయు; వినిపించిన = చెప్పగా; విదురుడు = విదురుడు; విని = విని; ముని = మునులలో; వరున్ = ఉత్తముని; చూచి = చూసి; పలికెన్ = పలికెను; వినయంబున్ = వినయము; ఎసగన్ = అతిశయించగ.

భావము:

అని ఈ విధంగా మైత్రేయుడు ధ్రువుడు శ్రీహరినుండి వరాలను పొందిన విధం అంతా విదురునికి వినిపించాడు. విన్న విదురుడు మహర్షితో సవినయంగా ఇలా అన్నాడు.