పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-291-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘాత్మ! మఱి నీవు జ్ఞరూపుం డనఁ-
గు నన్ను సంపూర్ణ క్షిణంబు
గు మఖంబులచేత ర్చించి సత్యంబు-
గు నిహసౌఖ్యంబు నుభవించి
యంత్యకాలమున నన్నాత్మఁ దలంచుచు-
ఱి సర్వలోక నస్కృతమును
హిఁ బునరావృత్తి హితంబు సప్తర్షి-
మండలోన్నత మగు మామకీన

4-291.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దము దగఁ బొందఁగల" వని రమపురుషుఁ
తని యభిలషితార్థంబు ర్థి నిచ్చి
తఁడు గనుఁగొను చుండంగ నాత్మపురికి
రుడగమనుఁడు వేంచేసెఁ గౌతుకమున.

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్మ; మఱి = మరి; నీవు = నీవు; యజ్ఞ = యజ్ఞము; రూపుండు = స్వరూపముగాకలవాడు; అనన్ = అనుటకు; తగు = తగిన; నన్ను = నన్ను; సంపూర్ణ = పూర్తి; దక్షిణంబులు = దక్షిణలుకలిగినవి; అగున్ = అయిన; మఖంబులన్ = యజ్ఞముల; చేతన్ = చేత; అర్చించి = పూజించి; సత్యంబులు = సత్యమైనవి; అగు = అయిన; ఇహ = ఈలోకపు; సౌఖ్యంబులన్ = సౌఖ్యములను; అనుభవించి = అనుభవించి; అంత్య = మరణ; కాలంబునన్ = సమయములో; నన్ = నన్ను; ఆత్మన్ = మనసులో; తలచుచున్ = ధ్యానము చేస్తూ; మఱి = మరి; సర్వ = అన్ని; లోక = లోకములచేతను; నమస్కృతముమును = నమసేకరింపబడునది; మహిన్ = భూమిపై; పునరావృత్తి = మరల వచ్చుట, జననమరణములు; రహితంబును = లేనిది; సప్తర్షి = ఏడుగురు ఋషులు; మండల = పదమునకు; ఉన్నతము = పైనది; అగు = అయిన; మామకీన = నా యొక్క.
పదమున్ = స్థానము; పొందగలవు = పొందగలవు; అని = అని; పరమపురుషుడు = విష్ణువు; అతని = అతని; అభిలషితార్థంబులు = కోరిన ప్రయోజనములు; అర్థిన్ = కోరి; ఇచ్చి = ఇచ్చి; అతడు = అతడు; కనుగొనుచుండన్ = చూస్తుండగ; ఆత్మ = స్వంత; పురికి = నగరికి; గరుడగమనుడు = విష్ణువు {గరుడగమనుడు - గరుడవాహనము పై తిరుగువాడు, విష్ణువు}; వేంచేసె = వెళ్ళను; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = ఒప్పునట్లుగ.

భావము:

పుణ్యాత్మా! నీవు యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాలచేత ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు. మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ, సకల లోకాలకు వందనీయమై, పునరావృత్తి రహితమై సప్తర్షిమండలం పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు.” అని భగవంతుడు ధ్రువుడు కోరిన కోరికలను ప్రసాదించి, అతడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆనందంగా తన పట్టణమైన వైకుంఠమునకు వేంచేశాడు.