పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-282-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హితాత్మ! మఱి జన్మరణ ప్రణాశన-
హేతు భూతుండవు నిద్ధకల్ప
రువవు నగు నిన్నుఁ గనెవ్వరే నేమి-
పూని నీ మాయా విమోహితాత్ము
గుచు ధర్మార్థ కామాదుల కొఱకుఁ దా-
ర్చించుచును ద్రిగుణాభమైన
దేహోపభోగ్యమై దీపించు సుఖముల-
నెనయంగ మదిలోన నెంతు; రట్టి

4-282.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విషయ సంబంధ జన్యమై వెలయు సుఖము
వారికి నిరయమందును ఱలు దేవ!
భూరి సంసార తాప నివా గుణ క
థామృతాపూర్ణ! యీశ! మావ! ముకుంద!

టీకా:

మహితాత్మ = హరి {మహితాత్మ - మహిమ కలవాడ, విష్ణువు}; మఱి = మరి; జన్మ = జన్మలు; మరణ = మరణములను; ప్రణాశన = పూర్తిగ నాశింపజేయుటకు; హేతుభూతుండవు = కారణమైనవాడవు; ఇద్ధ = ప్రసిద్ధమైన; కల్పతరువవు = కల్పతరువువంటివాడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; తగన్ = తగి; ఎవ్వరు = ఎవరు; ఏనేమి = అయినాసరే; పూని = నిశ్చయముతో; నీ = నీ; మాయా = మాయచేత; విమోహిత = బాగుగ మోహములోపడిన; ఆత్ములు = వారు; అగుచున్ = అవుతూ; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామ = కామము; ఆదుల = మొదలగువాటి; కొఱకున్ = కోసము; తాము = తాము; అర్చించుచున్ = పూజిస్తూ; త్రిగుణ = సత్త్వరజస్తమో (త్రి) గుణములతో; ఆభము = ప్రదీప్తము; ఐన = అయిన; = దేహ = శరీరమునకు; ఉపభోగ్యము = అనుభవించదగినవి; ఐ = అయ్యి; దీపించు = ప్రకాశించు; సుఖములన్ = సుఖములను; ఎనయంగన్ = పొందుటకు; మదిన్ = మనసు; లోనన్ = లోను; ఎంతురు = ఎంచుకొనెదరు; అట్టి = అట్టి.
విషయ = విషయములకు; సంబంధ = సంబంధముతో; జన్యము = పుట్టినది; ఐ = అయ్యి; వెలయు = విలసిల్లు; సుఖమున్ = సుఖములు; వారికి = వారికి; నిరయము = నరకము; అందును = లో కూడ; వఱలు = ప్రవర్తిల్లు; దేవ = దేవుడ; భూరిసంసారతాపనివారగుణకథామృతాపూర్ణ = విష్ణుమూర్తి {భూరి సంసారతాప నివార గుణకథామృతా పూర్ణ - అత్యధికమైనసంసారతాపములను నివారించుగుణముకల కథల అమృతమున నిండినవాడు, విష్ణువు}; ఈశ = విష్ణుమూర్తి; మాధవా = విష్ణుమూర్తి; ముకుంద = విష్ణుమూర్తి.

భావము:

మహానుభావా! దేవా! మాధవా! ముకుందా! అపారమైన సంసార తాపాలను నివారించే సుగుణాలతో కూడిన కథాసుధాపూరం కలవాడా! జనన మరణాలను తొలగించి నీవు ప్రాణులను రక్షిస్తావు. తమ తమ కోరికలు నెరవేరటం కోసం నిన్ను సేవించేవారు నీ మాయచేత మోసగింపబడినవారే. భక్తజన కల్పవృక్షం అయిన నిన్ను దైహికాలైన ఐహికసుఖాలకోసం కొందరు సేవిస్తారు. విషయ సంబంధమైన సుఖం నరకంలో కూడా లభిస్తుంది.