పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-281-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మతి నార్తబాంధవ! భద్ఝన బోధసమేతుఁడై భవ
చ్చణముఁ బొంది నట్టి విధి ర్గము సుప్తజనుండు బోధమం
యఁగఁ జూచురీతిఁ గనుట్టి ముముక్షు శరణ్యమైన నీ
ణములం గృతజ్ఞుఁడగు జ్జనుఁ డెట్లు దలంపకుండెడున్?

టీకా:

వర = శ్రేష్ఠమైన; మతిన్ = బుద్ధితో; ఆర్తబాంధవ = బాధలలో ఉన్నవారికి చుట్టము వంటివాడ; భవత్ = నీ యొక్క; ఘన = గొప్ప; బోధ = జ్ఞానము, బోధము; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భవత్ = నీ యొక్క; చరణమున్ = పాదమును; పొందిన = చెందిన; అట్టి = అటువంటి; విధి = బ్రహ్మదేవుని; సర్గమున్ = సృష్టిని; సుప్త = నిద్రించిన; జనుండు = వాడు; బోధము = మెలుకువ; అందున్ = లో; అరయగన్ = విచారించి; చూచున్ = చూసెడి; రీతిన్ = విధముగ; కనునట్టి = కనబడెడి; ముముక్ష = మోక్షము కోరెడివారికి; శరణ్యము = దిక్కు; ఐన = అయిన; నీ = నీ; చరణములన్ = పాదములను; కృతజ్ఞుండు = కృతజ్ఞుడు; అగు = అయినట్టి; సత్ = మంచి; జనుడు = వాడు; ఎట్లు = ఏ విధముగ; తలంపక = ధ్యానించకుండ; ఉండెడున్ = ఉండగలడు.

భావము:

దీనబాంధవా! నిద్రనుండి మేలుకొన్నవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లుగా బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానంచేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శిస్తాడు. మోక్షం కోరే వారికి శరణాలైన నీ చరణాలను కృతజ్ఞుడైన సజ్జనుడు ఎలా మరచిపోగలడు?