పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-278-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి యీశ్వరుండు విహంగ కులేశ్వర-
యానుఁడై నిజభృత్యుఁడైన ధ్రువునిఁ
నుఁగొను వేఁడుక నియింప నా మధు-
నమున కప్పుడు ని ధ్రువుండు
రువడి యోగవిపాక తీవ్రంబైన-
బుద్దిచే నిజమనోంబురుహ ముకుళ
మందుఁ దటిత్ప్రభాత మూర్తి యటఁ దిరో-
ధానంబునను బొంది త్క్షణంబ

4-278.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురోభాగమందు నిల్చిను బూర్వ
మధికజ్ఞాన నయన గోర సమగ్ర
మూర్తిఁ గనుఁగొని సంభ్రమమునను సమ్మ
దాశ్రువులు రాలఁ బులకీకృతాంగుఁ డగుచు

టీకా:

హరి = విష్ణువు; ఈశ్వరుండు = విష్ణువు; విహంగకులేశ్వర = గరుడుని {విహంగకులేశ్వరుడు - విహంగ (పక్షుల)కు ప్రభువు, గరుడుడు}; యానము = వాహనము ఎక్కినవాడు; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; భృత్యుడు = సేవకుడు; ఐన = అయిన; ధ్రువుని = ధ్రువుని; కనుగొను = చూసెడి; వేడుక = కుతూహలము; జనియింపన్ = పుట్టగా; ఆ = ఆ; మధువనమున్ = మధువనమున; కున్ = కు; అప్పుడు = అప్పుడు; చని = వెళ్ళి; ధ్రువుండు = ధ్రువుడు; పరువడి = క్రమముగ; యోగ = యోగము యొక్క; విపాకము = పరిపక్వముచేత; తీవ్రంబు = తీక్షణము; ఐన = అయిన; బుద్ధి = బుద్ధి; చేన్ = చేత; నిజ = తన యొక్క; మనః = మనస్సు అనెడి; అంబురుహ = పద్మపు; ముకుళము = మొగ్గ; అందున్ = లో; తటిత్ = మెరపు; ప్రభా = ప్రకాశముతో; ఆయత = విస్తారమైన; మూర్తిన్ = స్వరూపము; అటన్ = అక్కడ; తిరోధానంబునను = అదృశ్యమును; పొంది = పొంది; తత్క్షణంబ = అదేక్షణములో.
తన = తన యొక్క; పురోభాగము = ఎదుటి ప్రదేశము; అందున్ = లో; నిల్చినన్ = నిలబడగా; పూర్వ = ఇంతకుముందు; సమధిక = మిక్కిలి అదికమైన; జ్ఞాన = జ్ఞానము అనెడి; నయన = కన్నులకు; గోచర = కనబడిన; సమగ్ర = సమగ్రమైన; మూర్తిన్ = స్వరూపమును; కనుగొని = దర్శించి; సంభ్రమమునను = సంభ్రమము వలన; సమ్మద = ఆనంద; ఆశ్రువులు = బాష్పములు; రాలన్ = రాలుతుండగ; పులకీకృత = పులకరిస్తున్న; అంగుడు = దేహము కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

భగవంతుడైన హరి గరుడవాహన మెక్కి తన భక్తుడైన ధ్రువుణ్ణి చూడాలనే ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు ధ్రువమైన భక్తియోగంతో, నిశ్చలమైన బుద్ధితో తన మనస్సులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండటం చేత బయట ఉన్న శ్రీహరిని చూడలేకపోయాడు. ఇంతలో అతని మనస్సులోని మూర్తి మాయమై పోయింది. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు. తొట్రుపాటు చెందాడు. చెక్కిళ్ళపై స్రవించే ఆనంద బాష్పాలతో స్వామిని తిలకించి పులకించాడు.