పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-276-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రి! పరమాత్మ! కేశవ! చరాచర భూతశరీర ధారివై
రఁగుదు వీవు; నిట్టులుగఁ బ్రాణనిరోధ మెఱుంగ మెందు ముం
దివుగ దేవదేవ! జగదీశ్వర! సర్వశరణ్య! నీ పదాం
బురుహము లర్థిమై శరణు బొందెద మార్తి హరించి కావవే!"

టీకా:

హరి = విష్ణుమూర్తి; పరమాత్మ = విష్ణుమూర్తి; కేశవ = విష్ణుమూర్తి; చర = చలనము కల; అచర = చలనము లేని; శరీర = జీవులయందు; ధారివి = ధారణ కలవాడవు; ఐ = అయ్యి; పరగుదువు = ప్రవర్తిల్లువాడవు; ఈవు = నీవు; ఇట్టులగన్ = ఈ విధముగ; ప్రాణ = ప్రాణముల; నిరోధమున్ = చేటు; ఎఱుంగము = తెలియము; ఎందున్ = ఎక్కడను; ముందు = ఇంతకుముందు; తిరవుగన్ = నిశ్చయముగ; దేవదేవ = హరి {దేవదేవుడు - దేవుళ్ళకి దేవుడు, విష్ణువు}; జగదీశ్వర = హరి {జగదీశ్వరుడు - జగత్తునకు ఈశ్వరుడు, విష్ణువు}; సర్వశరణ్య = హరి {సర్వశరణ్యుడు - సర్వులకి (అందరికి) శరణ్యుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అంబురుహముల్ = పద్మములు; అర్థిమై = కోరి; శరణు = శరణము; పొందెదమున్ = పొందుచున్నాము; ఆర్తిన్ = ఆర్తిని, బాధను; హరించి = పోగొట్టి; కావవే = కాపాడుము.

భావము:

“శ్రీహరీ! పరమాత్మా! కేశవా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు కోరుతున్నాము. ఆపదను తొలగించి కాపాడు.”