పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-274-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకభయంకర మగు
నా లోకమహావిపద్దశాలోకనులై
యా లోకపాలు రందఱు
నా లోకశరణ్యుఁ గాన రిగిరి భీతిన్.

టీకా:

ఆలోక = చూచుటకు; భయంకరము = భీకరము; అగున్ = అయిన; ఆ = ఆ; లోక = లోకములకు; మహా = గొప్ప; విపత్ = ప్రమాదముల; దశా = దశను; ఆలోకనులు = చూసినవారు; ఐన = అయినట్టి; ఆ = ఆ; లోకపాలురు = లోకపాలకులు; అందఱున్ = అందరు; ఆ = ఆ; లోకశరణ్యున్ = నారాయణుని {లోకశరణ్యుడు - లోకములన్నిటికిని శరణ్యము యైనవాడు, విష్ణువు}; కానన్ = చూచుటకు; అరిగిరి = వెళ్ళిరి; భీతిన్ = భయముతో.

భావము:

లోకాలకు సంభవించిన ఆ చూడటానికి భయంకరమైన మహా విపత్తును చూచి అష్ట దిక్పాలకులు మొదలైన లోకపాలు రందరూ భయంతో లోకరక్షకుడైన హరిని దర్శించడానికి వెళ్ళారు.