పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-248-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు బాలుండ వగుటం జేసి వేదాధ్యయనా ద్యుచిత కర్మానర్హుండ వయ్యు నుచితంబులగు కుశాజినంబులం జేసి స్వస్తిక ప్రముఖాసనంబులం గల్పించుకొని త్రివృత్ప్రాణాయామంబులచేతం బ్రాణేంద్రియ మనోమలంబు లను చాంచల్య దోషంబులఁ బ్రత్యాహరించి స్థిరం బయిన చిత్తంబున.

టీకా:

మఱియున్ = ఇంకను; బాలుండవు = పిల్లవాడవు; అగుటన్ = అయినందుచేత; చేసి = వలన; వేద = వేదములను; అధ్యయన = అధ్యయనము; ఆది = మొదలగు; ఉచిత = ఉచిత; కర్మా = కర్మలకు; అనర్హుండవు = అర్హత లేనివాడవు; అయ్యున్ = అయినప్పటికిని; ఉచితంబులు = ఉచితములు; అగు = అయిన; కుశ = దర్భలు; అజినంబులన్ = జింకచర్మములను; చేసి = పొంది; స్వస్తిక = స్వస్తికాసనము; ప్రముఖ = మొదలైనముఖ్య; ఆసనంబులన్ = ఆసనములను; కల్పించుకొని = వేసి; త్రివృత్ = మూడు (3) ఆవృత్తుల (రేచక, పూరక, కుంభకములు); ప్రాణాయామంబుల్ = ప్రాణాయామముల; చేతన్ = చేత; ప్రాణ = ప్రాణముల; ఇంద్రియ = ఇంద్రియముల; మనః = మానసిక; మలంబులను = మలినములను; చాంచల్య = చంచలము అనెడి; దోషంబులన్ = దోషములను; ప్రత్యాహరించి = పరిహరించి; స్థిరంబు = స్థిరము; అయిన = అయినట్టి; చిత్తంబునన్ = చిత్తముయందు.

భావము:

ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోను, జింకచర్మంతోను స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని, పూరకము రేచకము కుంభకము అనే ఈ మూడు విధాలైన ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోమలాలను పొగొట్టుకొని, చాంచల్య దోషాలను తొలగించుకొని, స్థిరమైన మనస్సుతో (హరిని ధ్యానించు).