పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువోపాఖ్యానము

  •  
  •  
  •  

4-233-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రికింప నీ విశ్వరిపాలనమునకై-
ర్థి గుణవ్యక్తుఁ డైనయట్టి
నారాయణుని పాదళినముల్ సేవించి-
గ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె;
నుఁడు మీ తాత యా నువు సర్వాంతర-
యామిత్వ మగు నేకమైన దృష్టిఁ
జేసి యాగముల యజించి తా భౌమ సు-
ములను దివ్యసుముల మోక్ష

4-233.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుఖములను బొందె నట్టి యచ్యుతునిఁ బరుని
వితత యోగీంద్ర నికర గవేష్యమాణ
రణ సరసిజ యుగళు శశ్వత్ప్రకాశు
క్తవత్సలు విశ్వసంపాద్యు హరిని.

టీకా:

పరికింపన్ = పరిశీలించి చూసిన; ఈ = ఈ; విశ్వ = లోకములను; పరిపాలనమున్ = పరిపాలించుట; కై = కోసము; అర్థిన్ = కోరి; గుణ = గుణములచే; వ్యక్తుడు = తెలియబడువాడు; ఐనయట్టి = అయినటువంటి; నారాయణుని = హరి {నారాయణుడు - నారములు (నీరు) యందు వసించువాడు, విష్ణువు}; పాద = పాదములు అనెడి; నళినముల్ = పద్మములు; సేవించి = పూజించి; తగన్ = అవశ్యము; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; బ్రహ్మపదంబున్ = బ్రహ్మపదమును; ఒందెన్ = పొందెను; ఘనుడు = గొప్పవాడు; మీ = మీ; తాత = తాత; ఆ = ఆ; మనువు = స్వాయంభువ మనువు; సర్వ = సమస్తము; అంతర = లోను; యామిత్వము = వ్యాపించునది; అగు = అయిన; ఏకమైన = ఏకాగ్ర; దృష్టిన్ = దృష్టి; చేసి = తో; యాగముల = యజ్ఞములచే; యజించి = అర్చించి; తాన్ = తను; భౌమ = భూలోక; సుఖములను = సుఖములను; దివ్య = దేవలోక; సుఖములను = సుఖములను; మోక్ష = మోక్షము అనెడి.
సుఖములను = సుఖములను; పొందెన్ = పొందెను; అట్టి = అటువంటి; అచ్యుతుని = నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; పరుని = నారాయణుని {పరుడు - అతీతమైన వాడు, విష్ణువు}; వితతయోగీంద్రనికరగవేష్యమాణచరణసరసిజయుగళు = నారాయణుని {వితత యోగీంద్ర నికర గవేష్యమాణ చరణ సరసిజ యుగళు - విస్తారమైన యోగీంద్ర సమూహములచే గవేష్యమాణ (వెదకబడుతున్న) పాదపద్మముల యుగళము (ద్వయము) కలవాడు, విష్ణువు}; శశ్వత్ప్రకాశు = నారాయణుని {శశ్వత్ప్రకాశుడు - శాశ్వతముగా ప్రకాశించువాడు, విష్ణువు}; భక్తవత్సలు = నారాయణుని {భక్తవత్సలుడు - భక్తులయెడ వాత్యల్యము కలవాడు, విష్ణువు}; విశ్వసంపాద్యు = నారాయణుని {విశ్వసంపాద్యుడు - విశ్వ (లోకములను) సంపాద్యుడు (సంపాదింపదగినవాడు), విష్ణువు}; హరిని = నారాయణుని.

భావము:

“లోకాలను రక్షించడానికి సగుణస్వరూపాన్ని గ్రహించిన నారాయణుని పాదపద్మాలను ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందాడు. నీ తాత అయిన స్వాయంభువ మనువు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించి ఇహలోక సుఖాలను, పరలోక సుఖాలను అనుభవించి పరమపదాన్ని పొందాడు. నాశం లేనివాడు, యోగీశ్వరులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు కలవాడు, ఆయన అనంత కాంతిస్వరూపుడు, భక్తవత్సలుడు, విశ్వ సంసేవ్యుడు అయిన హరిని ఆశ్రయించు.