పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మహదాదుల సంభవంబు

  •  
  •  
  •  

3-201-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధృతిఁ బూని కాలచోదితము నవ్యక్తంబుఁ-
బ్రకృతియు నని పేళ్ళఁ రగు మాయ
న మహత్తత్త్వ మెమిఁ బుట్టించె మా-
యాంశ కాలాది గుణాత్మకంబు
నైన మహత్తత్త్వ చ్యుత దృగ్గోచ-
మగుచు విశ్వనిర్మాణవాంఛ
నందుటఁ జేసి రూపాంతరంబునఁ బొందె-
ట్టి మహత్తత్త్వ మందు నోలిఁ

3-201.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గార్యకారణ కర్త్రాత్మత్వ మైన
హిత భూతేంద్రియక మనోయ మనంగఁ
గు నహంకారతత్త్వ ముత్పన్న మయ్యెఁ
గోరి సత్త్వరజస్తమోగుణక మగుచు.

టీకా:

ధ్రుతిన్ = సంకల్పము; పూని = పూని; కాల = కాలముచే; చోదితమున్ = నడుపబడునది; అవ్యక్తంబున్ = అర్థముకానిది; ప్రకృతియున్ = ప్రకృతి {ప్రకృతి - ప్రథమ కృతి ప్రకృతి అనబడును}; అని = అను; పేళ్ళ = పేరులతో; పరగు = తెలియబడు; మాయ = మాయ; వలన = వలన; మహత్తత్త్వమున్ = మహత్తత్త్వమును {మహత్తత్త్వము - పంచభూతాది సృష్టికంటె ముందు స్థితిలోని సృష్టితత్త్వము}; ఎలమిన్ = వికాసంతో,సంతోషంతో; పుట్టించెన్ = పుట్టించెను; మాయ = మాయయొక్క; అంశ = అంశయు; కాల = కాలము; ఆది = మొదలగు; గుణా = గుణములతో; ఆత్మకంబును = కూడినది; ఐన = అయిన; మహత్తత్త్వమున్ = మహత్తత్త్వము; అచ్యుత = విష్ణువునకు {అచ్యుతుడు - పతనము లేనివాడు, విష్ణువు}; దృక్ = దృష్టికి మాత్రమే; గోచరము = కనిపించునది; అగుచున్ = అవుతూ; విశ్వ = విశ్వమును; నిర్మాణ = నిర్మించవలెనను; వాంఛన్ = కోరిక; అందుటన్ = చెందుట; చేసి = వలన; రూప = రూపములో; అంతరంబునన్ = మార్పును; పొందెన్ = పొందెను; అట్టి = అటువంటి; మహత్త్తత్త్వమున్ = మహత్తత్త్వము; అందున్ = లోపల; ఓలిన్ = క్రమముగా, వరుసగా; కార్య = కార్యములు {కార్యము - చేయబడినది (క్రియ)}; కారణ = కారణములు {కారణము - దానికి (కార్యమునకు) హేతువు (కర్మ?)}; కర్తృ = కర్త {కర్తృ - చేయునది (కర్త)}; ఆత్మకము = కూడినది; ఐన = అయినట్టి;
మహిత = గొప్ప; భూత = పంచభూతములు; ఇంద్రియక = పంచజ్ఞానేంద్రియములు మరియు పంచకర్మేంద్రియములు; మనస్ = మనసు; మయము = కూడినది; అనంగన్ = అనుటకు; తగు = తగిన; అహంకార = అహంకారము యొక్క; తత్త్వము = తత్త్వము; ఉత్పన్నము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; కోరి = కోరి; సత్త్వ = సత్త్వము; రజస్ = రజస్సు; తమస్ = తమస్సులుగా; గుణకము = గుణముల వృద్ధి; అగుచున్ = అవుతూ.

భావము:

కాలచోదితమూ, అవ్యక్తమూ, ప్రకృతి అనే పేర్లతో వ్యవహృతమైన తన మాయవల్ల మహత్తత్త్వాన్ని పుట్టించాడు. మాయకు సంబంధించినదీ, కాలము మొదలైన గుణాలు కలదీ అయిన ఈ మహత్తత్త్వం భగవంతుని కంటికి మాత్రమే కనిపిస్తూ ప్రపంచాన్ని నిర్మించాలనే కోరిక కల్గడంతో ఇంకొక రూపాన్ని పొందింది. రూపాంతరం పొందిన అటువంటి మహత్తత్త్వంలో నుంచి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే భేదాలు ఏర్పడి అవి వరుసగా పంచభూతాలు-ఇంద్రియాలు-మనస్సు అను రూపములుగా గోచరించాయి. ఈ మూడింటి నుండి సత్త్వరజస్తమోగుణాలతో కూడిన అహంకారం ఏర్పడింది.