పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : జగదుత్పత్తి లక్షణంబు

  •  
  •  
  •  

3-199-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బుద్ధిఁ దోచిన నమ్మహాపురుషవరుఁడు
కార్యకారణరూపమై నతకెక్కి
భూరిమాయాభిధాన విస్ఫురతశక్తి
వినుతికెక్కిన యట్టి యవిద్య యందు.

టీకా:

బుద్ధిన్ = మనసున; తోచిన = కలిగిన; ఆ = ఆ; మహా = గొప్ప; పురుష = పురుషులలో; వరుడు = శ్రేష్ఠుడు; కార్య = కార్యములు; కారణ = కారణములు అను; రూపము = రూపము; ఐ = అయి; ఘనతన్ = గొప్పదనమున; కున్ = కు; ఎక్కి = చెంది; భూరి = అతివిస్తారమైన; మాయ = మాయ అను; అభిదాన = పేరున; విస్ఫురిత = వ్యక్తమగు; శక్తిన్ = శక్తిగ; వినుతి = ప్రసిద్ధి; కిన్ = కి; ఎక్కిన = ఎక్కిన; అట్టి = అటువంటి; అవిద్య = అవిద్య; అందున్ = లోపల.

భావము:

ఇలా భగవంతునికి సృష్టి చేయాలనే సంకల్పం కలగగానే కార్యకారణాల రూపమై ఘనత వహించినదై మహత్తరమైన మాయశక్తిగా ప్రకాశించే అవిద్య రూపొందుతుంది. అందు.. . .