పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదుర మైత్రేయ సంవాదంబు

  •  
  •  
  •  

3-194-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మృదుగతిఁ బువ్వుదేనియ రమించుచుఁ బానముసేయఁ బాఱు ష
ట్పమునుఁ బోలి యార్తజనబాంధవు విశ్వభవస్థితివ్యయా
స్పమహితావతారుఁ డగు పంకరుహోదరు నిత్యమంగళ
ప్రగుణకీర్తనామృతముఁ బాయకఁ గ్రోలెదఁ జెప్పవే దయన్."

టీకా:

మృదు = సున్నితమైన; గతిన్ = విధముగ; పువ్వు = పువ్వుల యొక్క; తేనియన్ = తేనెని; రమించుచున్ = క్రీడించుతూ; పానము = తాగుట; సేయన్ = చేయుచు; పాఱు = తిరుగు; షట్పదమునున్ = తుమ్మెదను; పోలి = వలె; ఆర్తజనబాంధవు = కృష్ణుని {ఆర్తజనబాంధవు -ఆర్తి (బాధలనుండి విముక్తికై ప్రాధేయపడుట) కల జనులకు బంధువు, విష్ణువు}; విశ్వభవస్థితివ్యయాస్పదమహితావతారుఁడు = కృష్ణుని {విశ్వభవస్థితివ్యయాస్పదమహితావతారుఁడు - విశ్వము యొక్క పుట్టుక మనుగడ అంతములు అను కార్యములు చేయు గొప్ప అవతారములు కలవాడు, విష్ణువు}; అగు = అయిన; పంకరుహోదరు = కృష్ణుని {పంకరుహోదరుడు - పద్మము ఉదరమున కలవాడు, విష్ణువు}; నిత్య = నిత్యమైన; మంగళ = శుభములను; ప్రద = ఇచ్చు; గుణ = గుణములను; కీర్తన = కీర్తించుట అను; అమృతమున్ = అమృతము; పాయక = విడువక; క్రోలెదన్ = తాగెదను; చెప్పవే = చెప్పుము; దయన్ = దయతో.

భావము:

ఆపన్నులకు ఆప్తబాంధవుడూ, విశ్వానికి సంబంధించిన సృష్టికి స్థితి లయాలకు కారణభూతుడూ, అవతారపురుషుడూ, అయిన శ్రీమన్నారాయణుని కల్యాణగుణ సంకీర్తనం అనే అమృతాన్ని, మృదుమధురంగా పువ్వులలోని తేనెను గ్రోలే తుమ్మెదవలె నేను తనివి తీరా త్రాగుతాను. దయచేసి చెప్పుస్వామి.”