పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదుర మైత్రేయ సంవాదంబు

  •  
  •  
  •  

3-192-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీనితాధిప నామక
థావిముఖుల కిహముఁ బరము వ్వై పిదపం
బోవుదురు నరకమునకున్
వావిరి నే వారిఁ జూచి గతు మునీంద్రా!

టీకా:

శ్రీవనితాధిప = విష్ణుని {శ్రీవనితాధిపుడు - లక్ష్మీ ( శ్రీవనిత) పతి (అధిపుడు), విష్ణువు}; నామ = నామముల; కథా = కథల యందు; విముఖుల = అయిష్టుల; కున్ = కి; ఇహమున్ = ఇహము; పరము = పరము; దవ్వు = దూరము; ఐ = అయి; పిదపన్ = తరువాత; పోవుదురు = పోతారు; నరకమున = నరకమున; కున్ = కు; వావిరి = అధికముగ; నేన్ = నేను; వారిన్ = వారిని; చూచి = చూసి; వగతున్ = బాధపడుదును; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.

భావము:

ఓ మునీంద్రుడా! శ్రీమన్నారాయణుని నామస్మరణానికీ, కథాశ్రవణానికి విముఖులైన వారు ఈ లోకానికీ, పరలోకానికీ-రెంటికి కాకుండా చెడతారు. నరకంలో పడతారు. అట్లాంటి వాళ్ళను చూచి నేను ఎంతగానో బాధపడతాను.