పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి నిర్యాణంబు

  •  
  •  
  •  

3-1046.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర పయఃపేనపటలపాండుర కరీంద్ర
దంతనిర్మిత ఖట్వాంగవళపట్ట
చిత శయ్యాళులును జతురంతయాన
నకపీఠాది వస్తుసంముల నెల్ల.

టీకా:

అంచిత = అందమైన; స్పటిక = స్పటికములుతో; మయ = నిండిన; స్తంభ = స్తంభముల; దీప్తిన్ = ప్రకాశముచే; కొమరారు = మనోజ్ఞమగుతున్న; మరకత = పచ్చల; కుడ్యములను = గోడలను; సత్ = మంచి; జాతి = జాతికిచెందిన; వజ్రాల = వజ్రముల; సజ్జాల = సజ్జలు అను అలంకారముల; రుచుల్ = కాంతుల; చేన్ = చేత; భాసిల్లు = ప్రకాశించుతున్న; నీల = నీలముల; సోపానములును = మెట్లును; దీపించు = ప్రకాశించెడి; చంద్రకాంత = చంద్రకాంత చలువరాళ్ళ; ఉపలవేదులన్ = అరుగులును; విద్రుమ = పగడాల; గేహళీ = గడపలతో; విలసితముల = విలాసముల; హాటక = బంగారపు; రత్న = రత్నాల; కవాట = తలుపులచే; శోభితములన్ = సొగసులతోను; అలరిన = చక్కగా ఉన్న; సౌధ = మేడలు; శాల = చావళ్ళు; అంగణముల = ముంగిళ్ళ;
వర = శ్రేష్ఠమైన; పయస్ = నీటి; ఫేనపటల = నురగల వలె; పాండుర = తెల్లని; కరి = ఏనుగులలో; ఇంద్ర = శ్రేష్ఠమైన వాని; దంత = దంతములతో; నిర్మిత = చేసిన; ఖట్వ = మంచము; అంగ = కోళ్ళు; ధవళ = తెల్లని; పట్ట = బట్టలతో; రచిత = ఏర్పరచిన; శయ్య = పాన్పుల; ఆళులును = వరుసలును; చతురంతయాన = పల్లకీలు, {చతురంతయానము - పల్లకీ, చతుర్దోలము (తెలుగు పర్యాయపద నిఘంటువు, జిఎన్ రెడ్డి), నలుగురు మోయు ఉయ్యాలవంటి వాహనము (ఆంధ్ర శబ్దరత్నాకరము)}; కనక = బంగారపు; పీఠ = పీటలు; ఆది = మొదలైన; వస్తు = వస్తు; సంఘమున్ = సముదాయము; ఎల్లన్ = అంతటిని.

భావము:

ఆ ఉద్యావనం ప్రక్కనే స్ఫటిక స్తంభాలతో, పచ్చలు చెక్కిన గోడలతో, మేలుజాతి వజ్రాల గవాక్షాలతో, నిగనిగలాడే నీలకాంత మణి సోపానాలతో, పాలరాతి అరుగులతో, పగడాల గడపలతో, బంగారు తలుపులతో అలరారే సౌధం ఉంది. అందులో పాలనురుగు వంటి ఏనుగు దంతాలతో చేయబడిన పట్టెమంచాలపై తెల్లని పట్టుపరుపులు పరచి ఉన్నాయి. ఒక ప్రక్క ముత్ర్యాల పల్లకీలు, మరొక ప్రక్క బంగారు పీఠాలు పడి ఉన్నాయి. అటువంటి వైభవోపేతమైన వస్తు సంపదనంతా (దేవహూతి పరిత్యజించింది).