పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి నిర్యాణంబు

  •  
  •  
  •  

3-1043-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు కపిలుం డేఁగినఁ బిదప దేవహూతియుం బుత్రుండు సెప్పిన యోగమార్గంబున విజ్ఞానంబు గలిగి యుండియుం బెనిమిటి యైన కర్దమునిం దనయుం డైన కపిలునిం బాసి నష్టవత్స యగు గోవు చందంబునం దల్లడిల్లుచుఁ గపిలమహామునిం దలంచుచుం గర్దమ తపస్సామర్థ్యంబున నైనయట్టి.

టీకా:

అట్లు = ఆ విధముగ; కపిలుండు = కపిలుడు; ఏగిన = వెళ్ళిన; పిదప = తరువాత; దేవహూతియున్ = దేవహూతికూడ; పుత్రుండు = పుత్రుడు; చెప్పిన = చెప్పిన; యోగమార్గంబునన్ = యోగమార్గమున; విజ్ఞానంబున్ = విజ్ఞానము; కలిగి = కలిగి; ఉండియున్ = ఉండియును; పెనిమిటి = భర్త; ఐన = అయిన; కర్దమునిన్ = కర్దమునికిని; తనయుండు = పుత్రుడు; ఐన = అయిన; కపిలునిన్ = కపిలునికిని; పాసి = దూరమై; నష్ట = పోయిన; వత్స = దూడ కలిగినది; అగు = అయిన; గోవున్ = ఆవు; చందంబునన్ = వలె; తల్లడిల్లుచు = తల్లడిల్లుపోవుతూ; కపిల = కపిలుడు అను; మహా = గొప్ప; మునిన్ = మునిని; తలంచుచున్ = గుర్తుచేసుకొంటూ; కర్దమ = కర్దముని; తపస్ = తపస్సు యొక్క; సామర్థ్యంబునన్ = శక్తివలన; ఐన = అయిన; అట్టి = అటువంటి.

భావము:

ఆవిధంగా కపిలుడు వెళ్ళిపోయిన తరువాత దేవహూతి తన పుత్రుని ఉపదేశం వల్ల జ్ఞానోదయం కలిగినదైనా భర్త అయిన కర్దముని, కుమారుడైన కపిలుని ఎడబాసి దూడను పోగొట్టుకొన్న గోవు వలె తల్లడిల్లుతూ కపిల మహామునిని తలచుకొంటూ, కర్దముని తపశ్శక్తితో కల్పించబడినట్టి (ఉద్యానవనాన్ని చూసింది)