పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చంద్రసూర్యపితృ మార్గంబు

  •  
  •  
  •  

3-1031-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లీల నాత్మీయ పాదాంగుళీ వినిర్గ
తామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు
డఁగి నా పూర్వభాగ్యంబు తన నిపుడు
పూని నా గర్భమున నేడు పుట్టితయ్య!

టీకా:

లీలన్ = లీలగా; ఆత్మీయ = తన యొక్క; పాద = పాదము యొక్క; అంగుళీ = బొటకనవేలు నుండి; వినిర్గత = వెడలుచున్న; అమృతమున్ = అమృతమును; క్రోలునట్టి = తాగుచున్నట్టి; మహాత్మా = మహాత్ముడా; నీవున్ = నీవు; కడగి = యత్నించి; నా = నా యొక్క; పూర్వ = పూర్వజన్మములందలి; భాగ్యంబు = భాగ్యము; కతన = వశమున; ఇపుడు = ఇప్పుడు; పూని = పూని; నా = నా యొక్క; గర్భమునన్ = గర్భములో; నేడు = ఇప్పుడు; పుట్టితి = పుట్టితివి; అయ్య = తండ్రి.

భావము:

మహానుభావా! ఆ విధంగా వటపత్రశాయివైన నీవు లీలగా నీ కాలి బొటనవ్రేలిని నోటిలో నుంచుకొని అందలి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. అటువంటి నీవు నా పూర్వపుణ్య విశేషంవల్ల ఇప్పుడు నా కడుపున పుట్టావు.