పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చంద్రసూర్యపితృ మార్గంబు

  •  
  •  
  •  

3-1028.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లేక మనమునఁ గనియె ననేక శక్తి
ర్గములు గల్గి సుగుణప్రవాహరూప
మంది విశ్వంబు దాల్చి సస్రశక్తి
లితుఁడై సర్వకార్యముల్ లుగఁజేయు.

టీకా:

అనయంబున్ = ఎల్లప్పుడును; వినుము = వినుము; ఇంద్రియ = ఇంద్రియములచే; అర్థ = గుర్తింపబడునవియును; మనస్ = మనస్సు; మయంబున్ = తో కూడినది; భూతచయ = పంచ భూతముల సమూహమును; మయంబునున్ = తో కూడినది; అశేష = సమస్తమైన; భూరి = లెక్కించరాని {భూరి - అతి పెద్దసంఖ్య 1 తరువాత 34 సున్నాలు ఉండు సంఖ్య}; జగత్ = లోకముల మహా సృష్టికి; బీజ = విత్తనము; భూతంబునున్ = వంటిదియును; గుణ = గుణముల; ప్రవాహ = వ్యాప్తికి; కారణమును = కారణమైనదియును; వలను = నేర్పుతో; మెఱయు = ప్రకాశించునదియును; నారాయణ = నారాయణుడు అని; అభిఖ్య = పేరు; నాఁ గల = (అనగల) కలిగిన; భవదీయ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; మూర్తిన్ = స్వరూపముతో; తేజరిల్లు = అతిశయించు; చారు = అందమైన; భవత్ = నీ యొక్క; గర్భ = గర్భమున; సంజాతుడు = పుట్టినవాడు; అగునట్టి = అయినట్టి; కమలగర్భుండున్ = బ్రహ్మదేవుడు; సాక్షాత్కరింపన్ = దర్శించను;
లేక = లేక; మనమునన్ = మనస్సులో; కనియెన్ = చూసెను; అనేక = అనేకమైన; శక్తి = శక్తి యొక్క; వర్గములు = విభాగములు; కల్గి = కలిగి; సుగుణ = సుగుణముల; ప్రవాహ = వ్యాప్తియైన; రూపమున్ = రూపమును; అంది = పొంది; విశ్వంబున్ = విశ్వమును; తాల్చి = ధరించి; సహస్ర = అత్యధికమైన; శక్తి = శక్తితో; కలితుడు = కూడినవాడు; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన; కార్యముల్ = కార్యములను {కార్యములు - కార్యకారణసంబంధముచే కారణముల వలన అగు కార్యములు}; కలుగజేయు = సృష్టించును.

భావము:

ఇంద్రియాలతో, ఇంద్రియార్థాలతో, మనస్సుతో, పంచభూతాలతో నిండి సమస్త జగత్తుకు బీజభూతమై సత్త్వరజస్తమోగుణ ప్రవాహానికి మూలకారణమై నారాయణుడనే నామంతో నీ దివ్యమంగళ విగ్రహం తేజరిల్లుతూ ఉంటుంది. అటువంటి నీ కళ్యాణమూర్తిని నీ నాభికమలం నుండి జన్మించిన చతుర్ముఖుడే సాక్షాత్తుగా దర్శించలేక ఎలాగో తన మనస్సులో కనుగొన గలిగాడు. అలా చూచి నీ అనుగ్రహంవల్ల అనేక శక్తులను తనలో వ్యక్తీకరించుకొని వేలకొలది శక్తులతో కూడినవాడై ప్రవాహరూపమైన ఈ విశ్వాన్ని సృజింప గల్గుతున్నాడు. సృష్టి సంబంధమైన సర్వకార్యాలను నిర్వహింప గలుగుతున్నాడు.