పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చంద్రసూర్యపితృ మార్గంబు

  •  
  •  
  •  

3-1026-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంబ! నారాయణుం ఖిలశాస్త్రములను-
మధికానుష్ఠిత వన తీర్థ
ర్శన జప తపోధ్యయన యోగక్రియా-
దానకర్మంబులఁ గానఁబడక
యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి-
కల కర్మత్యాగరణి నొప్పి
లకొని యాత్మతత్త్వజ్ఞానమున మించి-
యుడుగక వైరాగ్యయుక్తిఁ దనరి

3-1026.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిత ఫలసంగరహిత ధర్మమునఁ దనరు
ట్టి పురుషుండు దలపోయ ఖిల హేయ
గుణములనుఁ బాసి కల్యాణగుణ విశిష్టుఁ
డైన హరి నొందుఁ బరమాత్ము నఘుఁ డగుచు

టీకా:

అంబ = తల్లీ; నారాయణుండు = భగవంతుడు {నారాయణుడు - నారము (నీరు)లు అందు వసించువాడు, విష్ణువు}; అఖిల = సమస్తమైన; శాస్త్రములనున్ = శాస్త్రముల వలనను; సమధిక = సమృద్ధిగా; అనుష్టిత = అనుష్టానములు; సవన = యాగములు; తీర్థదర్శన = తీర్థయాత్రలు; జప = జపములు; తపస్ = తపస్సులు; అధ్యయన = అధ్యయనములు; యోగక్రియా = యోగక్రియలు; దాన = దానములు; కర్మంబులన్ = కర్మలును వలనను; కానబడక = కనబడక; ఏచిన = విజృంభించిన; మనమున్ = మనస్సు; బాహ్య = బహిర్ముఖంబులు అయిన; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; గెల్చి = జయించి; సకల = సమస్తమైన; కర్మ = కర్మములను; త్యాగ = త్యజించు; సరణిన్ = విధముగా; ఒప్పి = ఒప్పుగా ఉండి; తలకొని = పూనుకొని; ఆత్మ = ఆత్మ; తత్త్వ = తత్త్వము యొక్క; జ్ఞానమునన్ = జ్ఞానమును; మించి = పెంచుకొని; ఉడుగక = వదలని; వైరాగ్య = వైరాగ్యమునందలి; యుక్తిన్ = నేర్పులో; తనరి = అతిశయించి;
మహిత = గొప్పదైన; ఫల = ఫలితములతో; సంగ = తగులము; రహిత = లేని; ధర్మమునన్ = ధర్మమునందు; తనరున్ = అతిశయించెడి; అట్టి = అటువంటి; పురుషుండు = పురుషుడు; తలపోయన్ = పరిశీలించిన; సకల = సమస్తమైన; హేయ = రోయదగిన; గుణములనున్ = గుణములకు; పాసి = దూరమై; కల్యాణ = శుభమైన; గుణ = గుణములు; విశిష్టుడు = విశిష్టముగ కలవాడు; ఐన = అయిన; హరిన్ = భగవంతుని; పొందున్ = చెందును; పరమాత్మున్ = పరమాత్ముని; అనఘుడు = పుణ్యుడు; అగుచున్ = అవుతూ.

భావము:

అమ్మా! నారాయణుడు సమస్త శాస్త్రాలను చదివినందువల్లను, అనుష్ఠానాలూ యజ్ఞాలూ తీర్థయాత్రలూ జపతపాలూ ఆచరించినందువల్లనూ కనిపించడు. వేదాలు అధ్యయనం చేయడం వల్లనూ, యోగాభ్యాసాల వల్లనూ, దానాలూ వ్రతాలూ చేసినందువల్లనూ గోచరింపడు. చంచలమైన మనస్సును లోగొని చెలరేగిన ఇంద్రియాలను జయించి, కర్మ లన్నింటినీ భగవదర్పితం చేసి, ఆత్మస్వరూపాన్ని గుర్తించి, తరిగిపోని వైరాగ్యంతో ఫలితాలను అపేక్షించకుండా ప్రవర్తించే పురుషుడు మాత్రమే దుర్గుణాలను దూరం చేసుకొని పాపాలను పటాపంచలు గావించి అనంత కళ్యాణ గుణ విశిష్టుడు పరమాత్మ అయిన ఆ హరిని చేరగలుగుతాడు.