పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చంద్రసూర్యపితృ మార్గంబు

  •  
  •  
  •  

3-1020.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నములను జాల గలిగి ధర్మముల యందు
శ్రద్ధతోఁ గూడి యప్రతిసిద్ధమైన
నిత్యనైమిత్తికాచార నిపుణు లగుచుఁ
గి రజోగుణ కలిత చిత్తములు గలిగి.

టీకా:

అట్టి = అటువంటి; సర్వేశ్వరుండు = నారాయణుడు {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; అయ్యయి = ఆయా; కాలంబులన్ = కాలముల; అందును = లోను; తత్ = ఆయా; గుణ = గుణముల; వ్యతికరమున = సమ్మేళనములతో; జనియించుచున్ = అవతరించుచును; ఉండున్ = ఉండును; ఈ = ఈ; చాడ్పునన్ = విధముననే; ఋషి = ఋషుల; దేవ = దేవతల; గణములు = సమూహములు; తమతమ = తమతమ; కర్మ = కర్మములచే; నిర్మిత = నిర్మింపబడినట్టి; ఐశ్వర్య = ఐశ్వర్యములు; పారమేష్ఠ్యములు = పరమేష్ఠిత్వముల; అందున్ = లోను; పురుషత్వమును = పుట్టుకలను; పొంది = పొంది; అధికారములున్ = అధికారములను; వహించి = చేపట్టి; వర్తించి = జీవించి; క్రమ్మఱన్ = మరలి; వత్తురు = వచ్చెదరు; మఱికొందఱు = మరికొంతమంది; ఆరూఢ = అధిష్టించిన; కర్మ = కర్మలను; అనుసారము = అనుసరించునది; ఐన = అయినట్టి;
మనములను = సంకల్పములు; కలిగి = కలిగి ఉండి; ధర్మముల = ఆయా ధర్మముల; అందున్ = లో; శ్రద్ధన్ = శ్రద్ధ; తోన్ = తోటి; కూడి = కలిగి ఉండి; అప్రతిసిద్ధము = విశిష్టము; ఐన = అయిన; నిత్య = నిత్య కర్మలు; నైమిత్తిక = నిమిత్తమునకైన కర్మలు; ఆచార = ఆచారములు లలో; నిపుణులున్ = నైపుణ్యములు కలవారు; అగుచున్ = అవుతూ; తగిన్ = అవశ్యము; రజోగుణ = రజోగుణములతో; కలిత = కూడిన; చిత్తములు = మనస్సులు; కలిగి = కలిగి ఉండి.

భావము:

అటువంటి సర్వేశ్వరుడు ఆయా సమయాలలో తన మహనీయ గుణగణాల కలయికచే అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని అంశలు పంచుకొని పుట్టిన ఋషులు, దేవతలు తమ కర్మఫలాన్ని అనుసరించి పౌరుషంతో ఐశ్వర్యం, పారమేష్ఠ్యం మొదలైన అధికారాలు చేపట్టి కొంతకాలం అనుభవించి, యథాస్థానానికి తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన మనస్సు కలవారై, ధర్మమందు శ్రద్ధ కలవారై, ధర్మానికి విరుద్ధం కాకుండునట్లుగా, నిత్యమూ తాము చేయదగిన ఆచారాలను నిర్వర్తిస్తూ, రజోగుణంతో నిండిన మనస్సు కలవారై...