పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చంద్రసూర్యపితృ మార్గంబు

  •  
  •  
  •  

3-1017.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానితాపునరావృత్తి మార్గమయిన
ప్రవిమలానంద తేజోవిరాజమాన
దివ్యపదమున సుఖియించు ధీరమతులు
రలిరారెన్నఁటికిని జన్మములఁ బొంద

టీకా:

మఱియున్ = ఇంకను; అహంకార = అహంకారము, నేను అను భావము; మమకార = మమకారములు, నాది అను భావములు; శూన్యులు = లేనివారు; ఐ = అయ్యి; అర్థిన్ = కోరి; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; అర్చి = వెలుగును; ఆది = గుర్తుగాకల; మార్గ = మార్గముల వెంట; గతుండున్ = వెళ్ళువాడును; మహనీయ = గొప్ప; చరితుండు = వర్తనలు కలవాడును; విశ్వతః = అత్యధికమైన; ముఖుడును = ప్రయత్నశీలియును; విమల = స్వచ్ఛమైన; యశుడు = కీర్తికలవాడును; జగత్ = విశ్వముల యొక్క; ఉద్భవ = సృష్టి; స్థాన = స్థితి; సంహార = లయ; కారణుండున్ = కారకుడు; అవ్యయుండున్ = నాశము లేనివాడును; అజుడున్ = పుట్టుకలేనివాడును; పరాపరుండున్ = పరము అపరము తానే అయినవాడు; పురుషోత్తముండు = పురుషులలో ఉత్తనుడు; నవపుండరీకాక్షుండు = నవకమైన పద్మముల వంటి కన్నులు ఉన్నవాడును; సర్వేశ్వరున్ = భగవంతుని; అందున్ = అందు; పొంది = పొంది;
మానిత = పూజనీయమైన; అపునరావృత్తి = వెనుకకు తిరిగి రానక్కరలేని; మార్గమునన్ = మార్గమున; ప్రవిమల = అతిస్వచ్ఛమైన; ఆనంద = ఆనందము; తేజస్ = తేజస్సులతో; విరాజమాన = విరాజిల్లుతున్న; దివ్య = దివ్యమైన; పదమునన్ = లోకమున; సుఖియించు = సుఖముగ ఉండెడి; ధీరమతులు = జ్ఞాన మనస్కులు; మరలి = వెనుకకుతిరిగి; రారు = రారు; ఎన్నటికిని = ఎప్పటికిని; జన్మములన్ = జన్మలను; పొందన్ = పొందుటకు.

భావము:

ఇంకా అహంకార, మమకారాలను వదిలి ప్రవర్తిస్తూ వెలుగు త్రోవల పయనించేవాడూ, గొప్ప చరిత్ర కలవాడూ, విశ్వమంతా నిండినవాడూ, పవిత్రమైన కీర్తి కలవాడూ, లోకాల సృష్టి స్థితి లయలకు కారణమైనవాడూ, నాశనం లేనివాడూ, జన్మరహితుడూ, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడూ, పురుషోత్తముడూ, క్రొత్త తామరలవంటి కన్నులు కలవాడూ అయిన సర్వేశ్వరునిపై బుద్ధి నిలిపి, పునర్జన్మ లేని మహనీయమైన మార్గంలో స్వచ్ఛమై ఆనందమయమై తేజస్సుతో వెలిగిపోయే దివ్యపదాన్ని పొంది సుఖించే ధీరులు పునర్జన్మలను పొందడానికి ఎన్నటికీ భూమిపైకి తిరిగిరారు.