పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చంద్రసూర్యపితృ మార్గంబు

  •  
  •  
  •  

3-1013.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుచుఁ దగ దేవ పితృ సువ్రతాఢ్యు లయిన
కామ్యచిత్తులు ధూమాదితులఁ జంద్ర
లోకమును జెంది పుణ్యంబు లుప్త మయిన
రలి వత్తురు భువికి జన్మంబు నొంద.

టీకా:

గృహము = గృహము; అందున్ = లో; వర్తించు = వసించు; గృహమేధులు = గృహస్తులు; అగు = అయిన; వారు = వారు; మహిత = గొప్పవి యైన; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామముల = కామముల; కొఱకున్ = కొరకు; సంప్రీతులు = మిక్కిలి కోరుతున్నవారు; అగుచున్ = అవుతూ; తత్ = వానిని; సాధనా = సాధించుటకైనవి; అనుష్టాన = చేయుటలో; నిరతులు = నిష్ఠకలవారు; ఐ = అయ్యి; వేద = వేదములందు; నిర్ణీత = నిర్ణయింప బడిన ప్రకారము; భూరి = అత్యధికమైన; భగవత్ = భగవంతునివి యైన; సు = మంచి; ధర్మ = ధర్మముల వర్తనము; తత్ = వాని పై; భక్తి = భక్తి యందు; పరాఙ్ముఖులు = విముఖులు; ఐ = అయ్యి; దేవ = దేవతల; గణములన్ = సమూహములను; అనుదినంబున్ = ప్రతినిత్యము; భజియించుచును = పూజించుచును; భక్తిన్ = భక్తిగా; పైతృ = పితృ; కర్మముల్ = కర్మలు; సేయుచున్ = చేస్తూ; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; శిష్ట = పెద్దలు యొక్క; చరితులున్ = ప్రవర్తన కలవారు; అగుచున్ = అవుతూ; తగన్ = అవశ్యము;
దేవ = దేవతల; పితృ = పితృదేవతల; సు = మంచిగ; వ్రత = పూజించుటలో; ఆఢ్యులు = గొప్పదనము కలవారు; అయిన = అయిన; కామ్య = కోరికలందు; చిత్తులు = మనస్సు కలవారు; ధూమ = పొగ; ఆది = మొదలైన వాని; గతులన్ = విధములుగా; చంద్రలోకమున్ = చంద్రలోకమున; కున్ = కు; చెంది = వెళ్ళి; పుణ్యంబున్ = (చేసిన) పుణ్యము; లుప్తము = లోపించినది; అయినన్ = అవ్వగా; మరలి = వెనుకకు మరలి; వత్తురు = వచ్చెదరు; భువికిన్ = భూమికి; జన్మంబున్ = (పునర్) జన్మమును; పొందన్ = పొందుటకు.

భావము:

“సంసారానికి కట్టుబడిన గృహస్థులు ధర్మార్థకామాలపై ప్రీతి కలిగి వాటితోనే సంతుష్టులై వాటిని సాంధించడంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వేదాలలో నిర్ణయింపబడిన భాగవత ధర్మాలకూ భగవద్భక్తికీ విముఖులై ఉంటారు. దేవగణాలను నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. పితృకార్యాలను భక్తితో చేస్తూ సదాచార సంపన్నులై ఉంటారు. కానీ ఇట్లా దేవతలకూ పితరులకూ సంబంధించిన సత్కర్మలను ఆచరించడంలోనే నేర్పరులై, కోర్కెలు నిండిన చిత్తం గలవారై ఉండి మోక్షాన్ని అందుకోలేరు. వారు ధూమ్రాది మార్గాలలో చంద్రలోకం చేరి అచ్చట సుఖాలు అనుభవించి పుణ్యం తరిగి నశింపగా మళ్ళీ జన్మ ఎత్తడం కోసం భూలోకానికి వస్తారు.