పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-999-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీనవదనుఁ డగుచు దేహి యీ దేహంబు
లన నిర్గమింపఁ లఁచి చనిన
నెలల నెన్నికొనుచు నెలకొని గర్భంబు
లన వెడలఁ ద్రోయువారు గలరె?'

టీకా:

దీన = దీనమైన; వదనుండున్ = ముఖము కలవాడు; అగుచున్ = అవుతూ; దేహి = దేహమును ధరించువాడు, జీవుడు; ఈ = ఈ; దేహంబున్ = శరీరమును; వలనన్ = నుండి; నిర్గమింపన్ = వెడలవలెనని; తలంచి = అనుకొని; చనిన = గడచిన; నెలలన్ = నెలలను; ఎన్నికొనుచున్ = లెక్కించుకొనుచును; నెలకొని = పూనుకొని; గర్భంబున్ = గర్భము; వలనన్ = వలన; వెడలన్ = వెలువడునట్లు; త్రోయు = తోసెడి; వారున్ = వారు; కలరే = ఉన్నారా.

భావము:

దైన్యంతో నిండిన ముఖం కలవాడై, ఆ గర్భనరకంనుండి బయటపడాలని భావిస్తూ, గడచిన నెలలు లెక్కించుకుంటూ ‘నన్ను ఈ గర్భంనుండి వెలువరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ’