పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-998-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జయిత్రి! గర్భ మందును
క్రిమి విణ్మూత్ర రక్త ర్తము లోనన్
మునుఁగుచు జఠరాగ్నిని దిన
దిమును సంతప్యమానదేహుం డగుచున్.

టీకా:

జనయిత్రి = తల్లి {జనయిత్రి - జననమును ఇచ్చినామె, తల్లి}; గర్భము = కడుపు; అందునున్ = లోపల; ఘన = అనేకమైన; క్రిమి = క్రిములు; విట్ = మలము; మూత్ర = మూత్రము; రక్త = రక్తములు కల; గర్తము = మురుకి గుంట; లోనన్ = లోపల; మునుగుచున్ = ములుగుతూ; జఠరాగ్నినిన్ = ఆకలితో; దినదినమును = రోజురోజుకి; సంతప్యమాన = మిక్కిలి తపించిపోతున్న; దేహుండు = శరీరము కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

“అమ్మా! జీవుడు తల్లి గర్భంలో క్రిములతో నిండిన మలమూత్రాల నెత్తురు గుంటలో మునుగుతూ, ఆకలి మంటలతో దినదినం తపించే దేహం కలవాడై...