పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-997-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అట్టి యీశ్వరుండు గాలత్రయంబు నందును జంగమ స్థావరాంత ర్యామి యగుటంజేసి జీవకర్మ మార్గంబులం బ్రవర్తించు వారు తాపత్రయ నివారణంబు కొఱకు భజియింతు" రని చెప్పి మఱియు నిట్లనియె.

టీకా:

అట్టి = అటువంటి; ఈశ్వరుండు = భగవంతుడు; కాలత్రయంబున్ = ముక్కాలముల {కాలత్రయము - 1 భూత 2భవిష్య 3వర్తమాన కాలములు మూడును}; అందునున్ = అందును; జంగమ = జంతువులు మొదలైనవి {జంగమములు - తిరుగునది, చరిష్ణువు, జంతువులు, పక్షులు}; స్థావర = వృక్షాదులు {స్థావరములు - స్థిరముగ ఒకే స్థలమున ఉండునవి, వృక్షములు మొదలైనవి}; అంతర్యామి = లోపలను వ్యాపించి ఉండువాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; జీవ = జీవుల యొక్క; కర్మమార్గంబులన్ = కర్మమార్గములలో; ప్రవర్తించు = తిరిగెడి; వారు = వారు; తాపత్రయ = తాపత్రయముల {తాపత్రయములు - 1ఆధిభౌతికము 2ఆధ్యాత్మికము 3ఆధిదైవికము అనెడి బాధాకారణముల మూడు}; నివారణంబు = పోగొట్టుకొనుట; కొఱకున్ = కోసము; భజియింతురు = కొలుతురు; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

“ఆ భగవంతుడు మూడు కాలాల్లోనూ చరాచర ప్రపంచంలోని సమస్త జీవరాసులలో అంతర్యామిగా ఉండడం వలన బ్రతుకు తెరువున పయనించేవారు తాపత్రయాలు తప్పించుకోవడానికై అతన్ని ఆరాధిస్తారు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.