పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-996.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్గుణధ్యాన తన్మూర్తి ర్శనములు
గోచరించుట యెట్లు నాకునుఁ బ్రబోధ
లితముగఁ బల్కు" మనవుడుఁ పిలుఁ డనియె
నంబతోడను సుగుణకదంబతోడ.

టీకా:

అనవుడు = అనగా; సుతున్ = పుత్రుని; కున్ = కి; జనని = తల్లి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనెను; తగ = అవశ్యము; మహితాత్మ = గొప్పవాడ; ఎవ్వని = ఎవని; మహిమ = మహిమ; చేత = వలన; ఘన = మిక్కిలి; మోహులు = మోహము చెందినవారు; ఐ = అయ్యి; గుణ = గుణములు; కర్మ = కర్మముల; నిమిత్తంబున్ = నిమిత్తకారణములును కల; సాంసారిక = సంసారమందు బద్ధమైన; మార్గ = దారిలో; సంచారములన్ = సంచరించుటలుచే; ధృతిన్ = ధైర్యము; చెడి = తప్పి; అలసి = అలసిపోయి; ఏ = ఏ విధమైన; దిక్కున్ = దిక్కును; ఎఱుంగక = తెలియక; హరి = విష్ణుమూర్తి యొక్క; పాద = పాదములను; ధ్యానంబునన్ = ధ్యానించుటలో; ఆత్మన్ = మనసున; మఱచి = మఱచిపోయి; ఉండు = ఉండెడి; వారల = వారి; కున్ = కి; ఏ = ఏ విధమైన; యుక్తియున్ = ఉపాయమునను; ఆ = ఆ; మహా = గొప్ప; పురుషుని = పురుషుని; అనుగ్రహ = అనుగ్రహించు; బుద్ధి = బుద్ధి; లేక = లేకుండగ;
తత్ = అతని; గుణ = గుణములను; ధ్యాన = ధ్యానము; తత్ = అతని; మూర్తిన్ = స్వరూపము; దర్శనములున్ = దర్శించుటలు; గోచరించుట = తెలియుట; ఎట్లు = ఏ విధముగానగును; నాకునున్ = నాకును; ప్రబోధ = తెలివితో; కలితముగన్ = కూడినది అగునట్లు; పల్కుము = చెప్పుము; అనవుడు = అనగా; కపిలుడున్ = కపిలుడు; అనియెన్ = పలికెను; అంబ = తల్లి; తోడన్ = తోటి; సుగుణ = సుగుణముల; కదంబ = వల్లి, కలగలపు మాల; తోడన్ = తోటి.

భావము:

అని చెప్పిన కొడుకుతో తల్లి ఇలా అన్నది “ఓ మహానుభావా! ఎవని మాయవల్ల మానవులు వ్యామోహంలో పడి గుణకర్మ నిమిత్తంగా ఏర్పడ్డ ఈ సంసార మార్గంలో ప్రయాణిస్తూ ధైర్యం చాలక, అలసిపోయి దిక్కు తెలియక చీకాకు పడుతూ చివరకు ఆ దేవుని పాదాలను ధ్యానించాలనే విషయాన్ని కూడా మనస్సులో మరచిపోతారో, ఆ పురుషోత్తముని అనుగ్రహం లేనిదే ఆ మానవులకు ఆయన గుణగణాలను ధ్యానించాలనీ, ఆయన రూపాన్ని దర్శించాలనీ బుద్ధి పుడుతుందా? ఈ సంగతి నాకు కనువిప్పు కలిగేలా విప్పి చెప్పు” అని అడిగిన సద్గుణవల్లియైన తల్లితో కపిలుడు ఇలా అన్నాడు.