పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-991.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మందు గర్కంధు వంత యౌ నంతమీఁదఁ
బేశి యగు నంతమీఁదటఁ బేర్చి యండ
ల్ప మగు నొక్క నెల మస్తమును మాస
మళమైనను గరచరములుఁ బొడము
గర్భస్థ పిండం దశలు

టీకా:

కైకొని = చేపట్టి; మఱి = మరి; పూర్వ = పూర్వపు జన్మలందలి; కర్మ = కర్మములకి; అనుగుణంబునన్ = అనుగుణముగా; శశ్వత్ప్రకాశుండు = హరి {శశ్వత్ప్రకాశుడు - శశ్వత్ (శాశ్వతమైన) ప్రకాశకుండు (ప్రకాశము కలవాడు), విష్ణువు}; ఈశ్వరుండు = హరి {ఈశ్వరుండు - ప్రభువు, విష్ణువు}; ఘటకుండు = సంఘటనలను కూర్చువాడు; కావునన్ = కనుక; క్రమ్మఱన్ = మరల; జీవుండు = జీవుడు; దేహ = శరీరముతో; సంబంధంబునన్ = సంబంధమును; తివిరి = ప్రయత్నించి; తాల్పన్ = ధరించుటకు; దొరకొని = పూనుకొని; పురుష = పురుషుని; రేతస్ = శుక్ర; బిందు = బిందువు తో; సంబంధి = సంబంధమును కలవాడు; ఐ = అయ్యి; వధూ = స్త్రీ యొక్క; గర్భంబున్ = కడుపు; అందున్ = లోకి; చొచ్చి = ప్రవేశించి; కైకొని = చేపట్టి; ఒక = ఒక; రాత్రి = రాత్రికి; కలిలంబున్ = బురదగను; పంచ = అయిదు; రాత్రములన్ = రాత్రులకు; బుద్బదమున్ = బుడగగను; దశమ = పదవ; దివసము = దినము; అందున్ = వరకు; కర్కంధువు = రేగుపండు; అంతన్ = అంతయును; అంతమీద = ఆపైన; పేశి = మాంసము కలదియును;
అగున్ = అగును; అంతమీదటన్ = ఆపైన; పేర్చి = పెరిగి; అండ = అండముగ; కల్పము = ఏర్పడుట; అగున్ = జరుగును; ఒక్క = ఒక; నెల = మాసమునకు; మస్తకమును = తలయును; మాస = నెలలు; యమళమున్ = రెండు; ఐనను = అయినచో; కర = చేతులు; చరణములు = కాళ్ళు; పొడము = పొడచూపును.

భావము:

“ఈశ్వరుడు శాశ్వతంగా ప్రకాశించేవాడు, అన్నిటినీ సంఘటిత పరిచేవాడు కాబట్టి జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి మళ్ళీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు పురుషుని వీర్యబిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి శుక్రశోణితాల ద్రవరూపమైన కలిలమై, తర్వాత ఐదురాత్రులకు బుద్బుదమై, ఆపైన పదవదినానికి రేగుపండంత అయి, అనంతరం మాంసపిండమై గ్రుడ్డు ఆకారం పొందుతాడు. ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి.