పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-1011-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పశు మిత్ర పుత్ర వనితా గృహకారణభూత మైన యీ
నువున నున్న జీవుఁడు పదంపడి యట్టి శరీర మెత్తి తా
నుగతమైన కర్మఫల మందకపోవఁగరాదు మింటఁ బో
యి భువిఁ దూరినన్ దిశల కేగిన నెచ్చట నైన డాగిఁనన్.

టీకా:

ధన = సంపద; పశు = పశువులు; మిత్ర = మిత్రులు; పుత్ర = పుత్రులు; వనితా = భర్య; గృహ = ఇల్లు లకు; కారణభూతము = కారణాంశముగ; ఐన = ఉన్నట్టి; ఈ = ఈ; తనువునన్ = దేహమున; ఉన్న = ఉన్నట్టి; జీవుడు = జీవుడు, దేహి; పదంపడి = తరవాత; అట్టి = అటువంటి; శరీరమున్ = దేహమున; ఎత్తి = ధరించి; తాన్ = తాను; అనుగతము = అనుసరించునది; ఐన = అయిన; కర్మ = కర్మముల; ఫలమున్ = ఫలితమును; అందక = చెందకుండగా; పోవగరాదు = పోవుట వీలుకాదు; మింటన్ = ఆకాశమునకు; పోయినన్ = వెళ్ళినను; భువిన్ = భూమిలోనికి; దూరినన్ = దూరినను; దిశల్ = దిక్కుల; కున్ = కు; ఏగినన్ = వెళ్ళినను; ఎచ్చటన్ = ఎక్కడ; ఐనన్ = అయినా; డాగినన్ = దాగు కొనినను.

భావము:

ధనధాన్యాలు, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైన ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇటువంటి శరీరాన్ని మళ్ళీ ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు.